Day-1 మనకి రామాయణం ఎలా ఒంట పట్టింది?

ఇటీవల ఒక మిత్రుడితో జరిగిన సంభాషణలు ఈ ఆలోచనలు trigger చేశాయి.

**

మనదేశం లో చాలా మంది రామాయణం మన చరిత్ర అని నమ్ముతాం. అవునా కాదా అన్నది వేరే విషయం. అయినా ఏదో పిల్లల బొమ్మల పుస్తకాలలో తప్పించి మనలో ఎంతమంది రామాయణం చదివి ఉంటాం? నా ఎరుకలో మన ఇళ్ళల్లో రామాయణ కావ్యాన్ని (ఏ భాషలోనైనా) చదివిన వారిని వేళ్ళమీద లెక్కపెడితే ఒకటి లేదా రెండు చేతులు చాలు. మరి ఈ రామాయణం అంటే మనకి ఇంత ప్రగాఢ విశ్వాసం ఎందుకు? అదే చిత్రం. నిశితంగా ఆలోచిస్తే millennials ముందు తరానికి (షుమారు 1980 కి ముందు పుట్టిన వాళ్లన్న మాట) తెలుగు చలన చిత్రం రామాయణం అందిచిందంటే అది అతిశోక్తికాదేమో? ఎందుకంటే, సినిమా తెలుగువారి lifeline. ఈ విషయం అందరికీ తెలిసినదే. దీనికి తోడు రేడియో మన time లో మనకి మాత్రమే దొరికిన పెద్ద అదృష్టం. పౌరాణిక సినిమాలు సరేసరి, ఒక్క రామాయణ కథ చెప్పడానికే బోలెడు ఉన్నాయి. ఇవి కాక సాంఘిక చిత్రాల్లో కూడా అడపా తడపా రామాయణ కథలు కామెడీ కోసమా, కధా వస్తువు కోసమో, symbolism కోసమో చక్కగా పాటలు కూర్చి వాడుకున్నారు. ఆ సినీ కవులు దర్శించి తరించి మనకు అందించిన రామాయణం మనం అట్టే అందిస్తే ఇట్టే పట్టేసుకున్నాం అని అంటే అది నిజం కాదు అని నా అభిప్రాయం. రేడియో లో వినగా వినగా (వయసు, అనుభవం తో పాటు) రామాయణం ఎంత గొప్ప కవ్యమో అంచెలంచెలుగా తెలుసుకో గలిగాం. అవే సినిమాలు అప్పుడప్పుడు వస్తూ / చూస్తూ ఉండటం, సినిమా లో పాటలు (అర్థం తెలియక పోయినా) కంఠస్థం వచ్చేయడం కూడా ఒక లాభం.

నాకు గుర్తు ఉన్నంత వరకు, నేను చూసిన, మొదటి రామాయణం సినిమా, విన్న పాటలు అంటే లవకుశ. రామాయణం టైటిల్ లోనే ఉన్న సినిమాలు అన్ని ఉంటే ఇదేమిటి, లవకుశ ఉత్తర రామాయణం కాదా అని మీరు అనవచ్చు. లవకుశుల తో గానం చేయించి వాల్మీకి మహర్షి రామాయణ కావ్యం తరతరాలకు అందిద్దాం అని అనుకుంటే, ఆ పని మనతరానికి సముద్రాల సీనియర్, కొసరాజు (lyrics) ఘంటసాల (music),. పుల్లయ్య (direction) భుజాల మీద వేసుకున్నారు. “ఆలకించినా, ఆలపించినా, ఆనందమొలికించే గాథ”, ఎంతబాగా చెప్పారు! ఎన్నిసార్లు విని వుంటాం ఆ సినిమా లో పాటలు? అసలు ఆ పాటలు మనకు చిన్నప్పుడే అర్థం అయిపోయాయా? ఖచ్చితంగా ఆ పాటల లో తెలుగు పూర్తిగా అర్థం అయ్యే వాళ్ళు మనలో ఎంతమంది? నామటుక్కు నేను ఆ పాటలు విన్నప్పుడల్లా ఇంకా అర్ధాలు వెతుక్కుంటూనే వుంటాను.

*
అప్పట్లో సినిమా చూడాలంటే ఎంత anticipation, excitement ఉండేది? సినిమా ఈ release లో చూడగలమా? బాబా (my father) తీసుకు వెళ్తారా? మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అంటారా? ఏదైతేనేం, ఏ సినిమా చూపించినా ready. దొరికిందే ఛాన్స్. అలా బాబా కాకినాడ లో సినిమా హాల్ రోడ్ లో (అప్పట్లో theatres అన్నీ ఒక్క వీధి లోనే ఉండేవి) సినిమా చుపించి ఇంటికి వస్తూ ఆ సినిమా గురించి చర్చించుకోవడం మామూలే. లవకుశ చూశాక, సినిమా ఎలా ఉందిరా అంటే, (నాకు అప్పటీకే ఏడుపు వస్తోంది) “పిల్లలని వదిలేసి సీతమ్మ అలా వాళ్ళమ్మ (భూదేవి) దగ్గరకి వెళ్లిపోయింది ఏమిటి? అయినా రాముడు సీతమ్మని అడివికి పంపటం నాకేమీ నచ్చలేదు. నెక్స్ట్ టైం tragedy ending cinema వద్దు. మంచి ఎండింగ్ ఉన్న సినిమా కీ వెళ్దాం” అన్నా (ఇంకో సినిమాకి టెండర్ కాబోలు). ఓహో నీకు అలా అర్ధం అయ్యిందా అన్నట్టో, నీకు అర్థం అవ్వడానికి ఇంకా టైమ్ పడుతుందిలే అన్నట్టో, నవ్వారు. అప్పటికి నాకు పది, పన్నెండు ఏళ్ళు ఉంటాయేమో. ఏమైతేనేం, కలర్ సినిమా, పిల్లలే హీరోలు, సినిమా గురించి మాట్లాడుకునేది విని, పాటల అర్ధాలు, పెద్దవాళ్ళు చెపితే తెలుసుకుని, ఇప్పుడు ఆ పాటలు విని ఎప్పుడూ ఇంతే అనందానుభూతి పొందినట్టు ఫీల్ అవుతున్న మాట మాత్రం నిజం. అసలు పాటలు రేడియో లో వస్తున్నపుడు వంత పాడుతూ ఉంటే, విన్న వాళ్లు తప్పులు సరిచేసి అసలు అర్థం వాళ్ళే చెప్పేసే వాళ్లు. అప్పట్లో అందరికీ బోల్డు టైమ్ ఉండేది.

చెప్పొచ్చేదేమిటంటే, మనం హిస్టరీ అనుకునేది మనపిల్లలు మైధాలజీ (myth) అని ఎలా అనుకుంటారో, మనలో చాలామంది కూడా చిన్న వయసులో అలాగ ఆలోచించిన వాళ్ళమే.

మన సంస్కృతి అంటే, “కాకికి పిండం పెట్టి అందరి భోజనాలు delay చెయ్యడం” అని వాళ్ళు అనుకుంటే వాళ్ళ తప్పేమీ లేదు. మనం అందిస్తేనే కాదా వాళ్లు అందుకునేది. మన సంస్కృతి లో భాగం మన నర నరాల్లో జీర్ణించుకున్న రామాయణం కాదూ, దాని శ్రవణం, మననం చేసి తర్కించుకుంటేనే కాదా వాళ్ళకి మనం ఆస్వాదించి ఆనందించిన విషయం చెప్పగలం.

పౌరాణికాలు, జానపదాలు, పిల్లలకి చూబించి చర్చించే అవకాశం ఇప్పుడు కూడా వుంది. సినిమా Amazon Prime లో నో YouTube లో నో వెదికితే దొరుకుతుంది. Thanks to Corona. ఇంకెందుకు ఆలస్యం? మీకు తెలియని విషయాలు ఏమీ కాకపోయినా, ఒక్కసారి మళ్ళీ శ్రవణం, మననం చేసకోవటానికి ఇది అవకాశంగా తీసుకుంటారు అని ఓ చిన్న ప్రయత్నం. బయటకు తిరగడం ఎలాగూ avoid చేస్తున్నాం కాబట్టి ఈ time ని ఇలా వినియోగం చేద్దాం.

మిమ్మల్ని inspire చెయ్యడానికి లవకుశ లో రెండు పాటల YouTube links కూడా share చేస్తున్నా.

Disclaimer: ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే. No offense to anyone intended. Take it or leave it.

Vinudu Vinudu Ramayana Gaatha (Lava Kusa)
Sri Ramuni Charitamunu Telipeda Mamma (Lava Kusa)