76. పుణ్యస్య ఫలమిచ్ఛన్తి

పుణ్యస్య ఫలమిచ్ఛన్తి
పుణ్యం నేచ్ఛన్తి మానవాః ।
ఫలం పపస్య నేచ్ఛన్తి
పాపం కుర్వన్తి యత్నతః ॥

puṇyasya phalamicchanti
puṇyaṃ necchanti mānavāḥ ।
phalaṃ papasya necchanti
pāpaṃ kurvanti yatnataḥ ॥

మానవాః (mānavāḥ) = మానవులు
పుణ్యస్య ఫలమ్ ఇచ్ఛన్తి (puṇyasya phalam icchanti) = పుణ్యకార్యాలు (మంచి పనులు) యొక్క ఫలితాన్ని (ఆనందం) కోరుకుంటారు
పుణ్యం న ఇచ్ఛన్తి (puṇyaṃ na icchanti) = (కానీ) పుణ్యకార్యాలు (మంచి పనులు) కోరుకోరు / చేయరు
పపస్య ఫలం న ఇచ్ఛన్తి (papasya phalaṃ na icchanti) = పాప కార్యాల దుష్ఫలితాన్ని కోరుకోరు / ఇష్టపడరు
యత్నతః పాపం కుర్వన్తి (yatnataḥ pāpaṃ kurvanti) = అయినప్పటికీ వారు (ప్రయత్నంగా) చెడు చర్యలు లేదా నేరాలు చేస్తూనే ఉంటారు

అర్ధం: అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఎవరూ మంచి పనులు చేయాలి అనుకోరు. ఎవరూ దుఃఖాన్ని కోరుకోరు, అయినప్పటికీ వారు (ప్రయత్నంగా) చెడు చర్యలు లేదా నేరాలు చేస్తూనే ఉంటారు!

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం