
కావ్యశాస్త్రవినోదేన
కాలో గచ్ఛతి ధీమతామ్ ।
వ్యసనేన తు మూర్ఖాణాం
నిద్రయా కలహేన వా ॥
kāvyaśāstravinodena
kālo gacchati dhīmatām ।
vyasanena tu mūrkhāṇāṃ
nidrayā kalahena vā ॥
ధీమతామ్ కాలః గచ్ఛతి (dhīmatām kālaḥ jacchati) = తెలివైన వ్యక్తుల సమయం గడిచిపోతుంది
కావ్యశాస్త్రవినోదేన (kāvya śāstra vinodena) = కవిత్వం, గ్రంధాలు మరియు వినోదం తో / లో
మూర్ఖాణాం తు (mūrkhāṇāṃ tu) = కానీ మూర్ఖుల (సమయం)
వ్యసనేన (vyasanena) = చెడు అలవాటుతో/లో
నిద్రయా (nidrayā) = నిద్రలో / తో
వా (vā) = OR కలహేన (kalahena) = తగాదా లో / తో
సూచన: తృతీయా విభక్తి (tṛtīyā vibhakti) (Instrumental Case)
అర్ధం: తెలివైన వ్యక్తుల సమయం గడిచిపోతుంది కవిత్వం, గ్రంధాలు మరియు వినోదం తో / లో. కానీ మూర్ఖుల సమయం చెడు అలవాటుత / లో; నిద్రలో / తో; తగాదా లో / తో (గడిచిపోతుంది).
సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం