0. సంస్కృతం తేలికగా నేర్చుకోవచ్చా?

సమాధానం “అవును” అని నేను గ్రహించాను. నేను అలా ఎందుకు అనుకుంటున్నానో చెప్పనివ్వండి.

మనలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఈ ప్రశ్న వచ్చి ఉండాలి. మీ మాతృభాష ఏదైనా భారతీయ భాష అయితే మరియు మీరు మీ మాతృభాషను మాట్లాడగలిగితే పై ప్రశ్నకి సమాధానం “అవును”. మీరు మాతృభాషలో చదవడం లేదా వ్రాయగలిగితే అది బోనస్. ఎందుకంటే, చాలా భారతీయ భాషలు సంస్కృతం నుంచే పుట్టాయి కనుక.

మీ మాతృభాషతో మీ అనుబంధం అంతంతమాత్రమే అయితే, మీరు సంస్కృతం నేర్చుకోవడం కష్టంగా అనిపించవచ్చు. మీరు నాతో ఏకీభవించకపోవడానికి మరొక కారణం ఏమికావచ్చంటే, మీకు ఇప్పటికే మాతృభాషపై అవగాహన ఉండి సంస్కృతం నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, కొన్ని ఫలించని ప్రయత్నాల తర్వాత విరమించుకునిఉంటే. నేను అర్థం చేసుకోగలను.

క్రొత్తది ఏదైనా నేర్చుకోవడానికి, ఆసక్తి మరియు వనరులు కీలకం. సంస్కృతం నేర్చుకోవడానికి ఉత్తమమైన కోర్సు ఏది అని తెలుసుకోవడానికి నేను చాలా సమయం వెతుకులాట (విండో షాపింగ్) లో గడిపాను. చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి వైవిధ్యంగా ఉంటాయి. ప్రతి ఒక్కటి దాని దేనిపాటికదే గొప్పది.

చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) సౌజన్యంతో, బ్రహ్మచారి వేద్ చైతన్య జీ బోధించిన “Sanskrit for Shastra Study” అనే కోర్సు YouTube లో యాదృశ్చికంగా కనుగొన్నాను.

వారానికి ఒక సంస్కృత శ్లోకం నేర్చుకోవడం పెద్ద విషయం కాదని నేను గ్రహించాను. ఈ సిరీస్ లో, నేను “Sanskrit for Shastra Study Course” లో భాగంగా శ్రీ వేద్ జీ బోధించిన శ్లోకాలు పునర్విమర్శ నెపంతో ప్రస్తుతి చేస్తున్నాను. ఈ కోర్సు కోసం CIF తరగతులు మీకు YouTube లో ఇక్కడ ఉపలభ్యం.

సౌజన్యం: CIF
చిత్ర సౌజన్యం: గూగుల్ ఇమేజేస్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం