47. యోగేన చిత్తస్య పదేన వాచాం

యోగేన చిత్తస్య పదేన వాచాం
మలం శరీరస్య తు వైద్యకేన ।
యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం
పతఞ్జలిం ప్రాఞ్జలిమానతోఽస్మి ॥

yogena cittasya padena vācāṃ
malaṃ śarīrasya tu vaidyakena

yo’pākarottaṃ pravaraṃ munīnāṃ
patañjaliṃ prāñjalimānato’smi

యః మలమ్ అపాకరోత్ (yaḥ malam apākarot) = మాలిన్యాన్ని (కల్మషాన్ని) తొలగించే వానికి
చిత్తస్య (cittasya) = మనస్సులోని
యోగేన (yogena) = యోగం ద్వారా (యోగసూత్ర)
వాచామ్ (vācām) = వాక్కు లోని
పదేన (padena) =పదశాస్త్రం (మహాభాష్యం) ద్వారా
శరీరస్య తు (śarīrasya tu) = శరీరము లోని
వైద్యకేన (vaidyakena) = వైద్య శాస్త్రం ద్వారా (శుశ్రూతుని అవతారం గా)
తం పతఞ్జలిమ్ (taṃ patañjalim) = ఆ పతఞ్జలికి
మునీనాం ప్రవరమ్ (munīnāṃ pravaram) = మునులందరిలోను శ్రేష్టుడైనట్టి
ప్రాఞ్జలిమ్ ఆనతః అస్మి (prāñjalim ānataḥ asmi) = ముకుళిత హస్తాలతో నమస్కారాలు చేస్తున్నాను.

అర్ధం: యోగం ద్వారా మనస్సులోని; మహాభాష్యం ద్వారా వాక్కు లోని; వైద్య శాస్త్రం ద్వారా (శుశ్రూతుని అవతారం గా) శరీరము లోని మాలిన్యాన్ని (కల్మషాన్ని) తొలగించే – మునులందరిలోను శ్రేష్టుడైనట్టి – ఆ పతఞ్జలికి ముకుళిత హస్తాలతో నమస్కారాలు చేస్తున్నాను.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: వికీపీడియా (హరిద్వార్‌లోని పతంజలి ఆధునిక విగ్రహం)
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం