56. కాన్ పృచ్ఛామః సురాః

కాన్ పృచ్ఛామః సురాః
స్వర్గే నివసామో వయం భువి ।
కిం వా కావ్యరసః స్వాదుః
కిం వా స్వాదయసీ సుధా ॥

kān pṛcchāmaḥ surāḥ
svarge nivasāmo vayaṃ bhuvi

kiṃ vā kāvyarasaḥ svāduḥ
kiṃ vā svādayasī sudhā

కాన్ పృచ్ఛామః (kān pṛcchāmaḥ) = ఎవరిని అడగాలి?
సురాః స్వర్గే (surāḥ svarge) = దేవతలు స్వర్గంలో (ఉన్నారు)
వయం భువి నివసామః (vayaṃ bhuvi nivasāmaḥ) = మనం భూమిపై నివసిస్తున్నాము
కిం వా కావ్యరసః స్వాదుః (kiṃ vā kāvyarasaḥ svāduḥ) = కవిత్వం రుచిగా ఉంటుందా?
కిం వా స్వాదయసీ సుధా (kiṃ vā svādayasī sudhā) = లేక అమృతం రుచిగా ఉంటుందా?

అర్ధం: దేవతలు స్వర్గంలో మరియు మనం భూమిపై నివసిస్తున్నాము. ఏది రుచిగా ఉంటుందో ఎవరిని అడగాలి? కవిత్వం రుచిగా ఉంటుందా? లేక అమృతం రుచిగా ఉంటుందా? (కవిత్వం అమృతంలా రుచిగా ఉంటుంది!)

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం