Day-5 తెలుగు చలన చిత్రాల్లో రామాయణ కథలు

మొన్నటి రోజున, స్వాతి ముత్యం సినిమా లో హరికథ గురించి ప్రస్తావించుకున్నపుడు అదే చిత్రం లోని సువ్వి సువ్వీ, సువ్వాలమ్మా పాట గుర్తు రావడం సహజం. నేనైతే ఒకసారి మళ్ళీ విని భావుకత కు లోనయిన మాట మాత్రం వాస్తవం.

చిత్రం: స్వాతిముత్యం (1986)
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్పీ, జానకి
సాహిత్యం: సినారే

“సీత కష్టాల ముందు నా కష్టం ఏపాటిది” అనిపించేటన్ని కష్టాలు, సీతమ్మ వారివి.

స్వాతిముత్యం లో “ఇది మా సంబరాల్లో పాడే సీతమ్మవారి పాట” అని వెర్రిబాగుల హీరో తో కూడా పాడించేశారు దర్శకుడు K విశ్వనాధ్ గారు.
ఆంత చక్కటి చిత్రీకరణ, ప్రధాన పాత్రల అభినయం , సాహిత్యాన్ని ఏమాత్రం ఆధిపత్యం (dominate) చెయ్యలేదు, అదే దర్శకుని ప్రతిభ.

**

సినిమా కథ తో సంబంధం ఉన్నా, లేకపోయినా, రామకథను అప్పుడప్పుడు వినిపించే అవకాశం వీలైనప్పుడల్లా సినీ కవులు వాడుకునే సందర్భం…. ఊళ్ళో సంబరాలు.

సిరిసిరమువ్వ లో “ఊరేగినా వాడే, ఊరేలినా వాడే ….. మావూరి దేవుడమ్మా” (వేటూరి/మహదేవన్) అన్నా, శ్రీమంతుడు లో “రాములోడు వచ్ఛినాడు రో” (రామజోగయ్య శాస్త్రి / దేవి శ్రీ ప్రసాద్) అన్నా అది రామ కథే.

ఈ రెండు పాటల బాణీ, పరిశీలిస్తే, తెలుగు సినిమా సంగీతాన్ని ప్రాంతీయత ఎంతగా ప్రభావితం చేస్తోందో తెలుస్తుంది. అయినా తెలుగు సినీ సాహిత్యం ఏమాత్రం పట్టు తప్ప లేదు చెప్పడానికి రామజోగయ్య శాస్త్రి “మరామ రామ రామ రామ రామ రామ” లోని ఈ చరణం ఒక్కటీ చాలు.
(‘మరా’ అని ఎందుకు మొదలు పెట్టడబ్బా?!)

“జీవుడల్లే పుట్టినాడురో, దాన్ తస్స దియ్య, దేవుడల్లే ఎదిగినాడు రో,
నేల బారు నడిచినాడు రో,
దాన్ తస్స దియ్య, పూల పూజ లంది నాడు రో,
పద పద మని వంతెనేసి పెనుకడలిని దాటినాడు,
పది పది తల లున్న వాడ్ని పట్టి తాట తీసినాడు, చెడు తలపుకు చావుదెబ్బ తప్పడంటు చెప్పినాడురో….”

Mahesh Babu’s larger than life image and visuals may have partly robbed the beauty of the lyrics.

You may want to enjoy the lyrics, without visuals distracting.

సువ్వీ సువ్వీ సువ్వాలమ్మా (స్వాతిముత్యం)

రామ రామ రామ రామ (శ్రీమంతుడు)