నా గోడు

మహమ్మారి కరోనా (pandamic carona) నాతో ఈ కవిత్వం కూడా రాయించింది. అయితే ప్రస్తుత విషయం నా కవిత్వం కాదు. Google Translate Tool దానికి చేసిన అనువాదం.

అమ్మా నాన్నతో మొదలైంది ఆనాడు.
అన్నదమ్ముల తోడు,
అక్క చెల్లెళ్ల జోడు.
బంధు మిత్రులు నాడు
పిల్ల పాపలు నేడు.
నాకంటూ ఒక్కడూ
నన్ను నమ్మిన వాడు అంటూ,
పుట్టి బుద్ధి ఎరిగినది మొదలు
కోరుతున్నా తోడు!

*

నా కాళ్ళ పై
నిలబడ్డ నాడు మొదలై
తోడు తో పాటుగా
కూడూ, గూడూ జోడై,
నిలువ నీడకై గూడే లోకమై,
నేనేమి చేసినా తోడు-నీడ
కోసమే నని ఒత్తిళ్ళకు లోనై
నీ ఉనికికి దూరమై
అట్టే వచ్చేసింది అరవై!

**

నీతో ఆడుకున్న రోజులూ,
నీతో గెంతులేసిన వీధులూ,
తన్నుకున్న రోజులూ,
నువ్వు భయపెట్టిన రోజులూ,
ఎలా మరిచి పోయా ఇన్ని రోజులూ?

**

మనం కలిసున్న
ఈ మూడు వారాలూ,
నాకు గుర్తు చేశాయి,
నువ్వెప్పుడూ నాతోనే ఉన్నావు,
ఎప్పటికీ ఉంటావని.
నాతో నడవడానికి,
నేను మాట్లాడుకోవడానికి!

*

ఇంకెప్పుడూ విస్మ రించను నిన్ను,
తెలుసుకున్నా ఎప్పటికీ,
నా నీడే నా తోడు అని!

**

On a lighter note!

My friend picked up my poetry from a group chat and pasted it on Google translate and got the below result. In the end my poetry was nothing but *n*u*d*e*!

Moral: Someone out there may use tools to read your mind, beware.

Google ripped it off.

QUOTE

My nude

Amma started with daddy.
Accompanied by reassurance,
Sister’s sister.
Relative friends
Child sins today.
All alone
He who believes in me,
Be born and start to become obsessed
Accompanying!

*

On my legs
Beginning on the stand
Along with accompaniment
Furthermore
Goodbye to the shadow
Whatever I do, shade
I am under pressure
Far from your presence
Sixty!

**

The days of playing with you,
The streets you go with,
Days gone by
The days that scared you,
How long have you forgotten?

**

We meet together
These three weeks,
Reminded me,
You are always with me,
Forever.
To walk with me,
I have to talk!

*

Never forget you
Never know
My * Needy * called my * companion *!

**

UNQUOTE