సంస్కృత శ్లోకం-1 (అగజాననపద్మార్కం)

అగజాననపద్మార్కం గజాననమహర్నిశమ్ ।
అనేకదన్తం భక్తానామ్ ఏకదన్తముపాస్మహే ॥

agajānanapadmārkaṃ gajānanamaharniśam ।
anekadantaṃ bhaktānām ekadantamupāsmahe ॥

అగ (aga) = కదలనిది (that which does not move) = mountain (పర్వతం)
అగజా (agajā) = పర్వతానికి పుట్టినది, పర్వతరాజపుత్రి (girl who is born to a mountain) = పార్వతి (pārvati)
ఆనన (ānana) = ముఖము (face)
పద్మ (padma) = కమలం (lotus)
అర్క (arka) = సూర్యుడు (Sun)
అగజా-ఆనన-పద్మ-అర్కమ్ (agajā-ānana-padma-arkam) = పద్మానికి సూర్యుడెట్లో పార్వతికి అట్టివాడవైన గణపతికి (to the one who is the Sun for the lotus face of pārvati)
గజాననమ్ (gajānanam) = గజస్య ఆననమ్ ఇవ ఆననం యస్య (gajasya ānanam iva ānanaṃ yasya) = ఏనుగు వంటి ముఖము కలవానికి (to the one whose face is like that of the elephant) = గణపతిమ్ (gaṇapatim)
అహర్నిశమ్ (aharniśam)= రేయీ పగలూ – ఎల్లవేళలా (day and night – always)
అనేకదన్తమ్ (anekadantam) = అనేకదమ్ (anekadam) + తమ్ (tam)
అనేకదమ్ (anekadam) = అన్నీ (ఏదైనా) ప్రసాదించే (ఇచ్చే) వాడికి (to the one who gives many / everything)
భక్తానామ్ (bhaktānām) = భక్తులకు (for the devotees)
ఏకదన్తమ్ (ekadantam)= ఒకే దంతము గల్గిన వానికి (to the one who has got one tooth)
తమ్ (tam)= వానికి (to Him)
ఉపాస్మహే (upāsmahe) = (మేము) ఆరాధిస్తాము (we worship)

అన్వయ (గద్య క్రమం): (వయమ్) అగజాననపద్మార్కం, గజాననం, భక్తానామ్ అనేకదమ్, ఏకదన్తం, తం, అహర్నిశమ్ ఉపాస్మహే ।

(Prose Order):
(vayam) agajānanapadmārkaṃ, gajānanaṃ, bhaktānām anekadam, ekadantaṃ, taṃ, aharniśam upāsmahe

అర్ధం: పార్వతి యొక్క పద్మము వంటి ముఖానికి సూర్యుడి వంటి వాడిని, ఏనుగు ముఖం వంటి ముఖము గల్గిన వాడిని, భక్తులకు సర్వాన్ని ప్రసాదించేవాడిని మరియు ఒకే దంతం కలిగిన వాడిని (మేము) ఎల్లప్పుడూ ఆరాధించెదము.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: మంజు సత్తిరాజు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం