5. శివం శివకరం

శివం శివకరం శాన్తం
శివాత్మానం శివోత్తమమ్ ।
శివమార్గప్రణేతారం
ప్రణతోఽస్మి సదాశివమ్ ॥

śivaṃ śivakaraṃ
śāntaṃ śivātmānaṃ śivottamam

śivamārgapraṇetāraṃ
praṇato’smi sadāśivam

శివమ్ (śivam)= పరమశివునికి – మంగళకరమైనవానికి
శివకరమ్ (śivakaram) = ప్రతిదీ శుభప్రదంగా చేసేవానికి
శాన్తమ్ (śāntam) = ప్రశాంతంగా ఉండేవానికి
శివ-ఆత్మానమ్ (śiva-ātmānam) = ఆంతర్యంగా శుభం అయినవానికి
శివ-ఉత్తమమ్ (śiva-uttamam) = అత్యంత పవిత్రమైన వానికి
శివ-మార్గ-ప్రణేతారమ్ (śiva-mārga-praṇetāram)= శివ మార్గం ప్రారంభించిన వానికి
సదాశివమ్ (sadāśivam)= ఎల్లప్పుడూ శుభప్రదమైన వానికి
ప్రణతః అస్మి (praṇataḥ asmi) = నేను ప్రణామాలు చేస్తున్నాను.

అర్ధం: పరమశివునికి – మంగళకరమైనవానికి; ప్రతిదీ శుభప్రదంగా చేసేవానికి; ప్రశాంతంగా ఉండేవానికి; ఆంతర్యంగా శుభం అయినవానికి; అత్యంత పవిత్రమైన వానికి; శివ మార్గం ప్రారంభించిన వానికి; ఎల్లప్పుడూ శుభప్రదమైన వానికి నేను ప్రణామాలు చేస్తున్నాను.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: మంజు సత్తిరాజు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం