3.2 సమస్తజన కల్యాణే

సమస్తజన కల్యాణే
నిరతం కరుణామయమ్ ।
నమామి చిన్మయమ్ దేవం
సద్గురుం బ్రహ్మవిద్వరమ్ ॥

samastajana kalyāṇe
nirataṃ karuṇāmayam

namāmi cinmayam devaṃ
sadguruṃ brahmavidvaram

సమస్త-జన-కల్యాణే (samasta-janana-kalyāṇe) = సమస్త జన కల్యాణము కోసమై
నిరతం (nirataṃ) = ఎల్లప్పుడు అంకితభావముతో ఉన్నట్టి
కరుణామయమ్ (karuṇāmayam) = కరుణగల్గి ఉండెడి
చిన్మయమ్ (cinmayam) = చైతన్య స్వరూపుడైన
దేవం (devaṃ) = భగవంతునికి చిన్మయదేవ = స్వామీ చిన్మయానన్ద
సద్గురుమ్ (sadgurum) = ఉత్తముడైన (అసలైన) గురువునకు
బ్రహ్మవిద్-వరమ్ (brahmavid-varam) = బ్రహ్మ జ్ఞానము తెలిసినవానికి
నమామి (namāmi) = నమస్కరించుచున్నాను

అర్ధం: సమస్త జన కల్యాణము కోసమై; ఎల్లప్పుడు అంకితభావముతో ఉన్నట్టి; కరుణగల్గి ఉండెడి; చైతన్య స్వరూపుడైన; చిన్మయదేవ భగవంతుని (స్వామీ చిన్మయానన్ద) కి; ఉత్తముడైన (అసలైన) గురువునకు; బ్రహ్మ జ్ఞానము తెలిసినవానికి; నమస్కరించుచున్నాను.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: చిన్మయ మిషన్ కిండర్ గార్టెన్ బాలవిహార్ బ్లాగ్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం