2. శారదా శారదామ్భోజ

శారదా శారదామ్భోజ-
వదనా వదనామ్బుజే ।
సర్వదా సర్వదాస్మాకం
సన్నిధిం సన్నిధిం క్రియాత్ ॥

śāradā śāradāmbhoja-
vadanā vadanāmbuje

sarvadā sarvadāsmākaṃ
sannidhiṃ sannidhiṃ kriyāt

శారదా (śāradā) = సరస్వతీ (sarasvatī) = సరస్వతీ దేవి
శారద (śārada) = శరదృతువు లోని (శరద్) (śarad)
అమ్భో (ambho) = నీటిలో
జ (ja) = పుట్టిన
అమ్భోజ (ambhoja) = నీటి నుండి పుట్టిన (అమ్భస్) (ambhas)= కమలం (వంటి)
వదన (vadana) = ముఖం
శారద్-అమ్భో-జ-వదనా(śārad-ambho-ja-vadanā) = ఎవరి ముఖం శరదృతువు లోని కమలంను పోలి ఉంటుందో
అమ్బుజ (ambuja) = నీటి నుండి పుట్టిన (అమ్బు) (ambu) = కమలం
అస్మాకం వదన-అమ్బుజే (asmākaṃ vadana-ambuje) = మన కమలం వంటి (అందమైన) నోటిలో
సర్వదా (sarvadā) = సర్వ దదాతి యా (sarva dadāti yā) = (కోరినవి) అన్నీ ఇచ్చే
సర్వదా (sarvadā) = ఎల్లప్పుడూ
సన్నిధిమ్ (sannidhim) = అన్ని (అంతర్గత) సంపదలతో పాటు
సన్నిధిమ్ క్రియాత్ (sannidhim kriyāt) = నివసించుగాక

అన్వయ (గద్య క్రమం) : శారదామ్భోజ-వదనా సర్వదా శారదా
సన్నిధిమ్ అస్మాకం వదనామ్బుజే సర్వదా సన్నిధిం క్రియాత్ ।

Anvaya: śāradāmbhoja-vadanā sarvadā śāradā sannidhim
asmākaṃ vadanāmbuje sarvadā sannidhiṃ kriyāt

అర్ధం: శరదృతువు లోని తామరపువ్వు వంటి ముఖం గల, సర్వస్వాన్ని ప్రసాదించే సరస్వతీదేవి (మన) కమలం వంటి నోటిలో సకల సంపదల రూపంలో ఎప్పుడూ నివసించు గాక!

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం