10. రామో నామ బభూవ*

సమ్భాషణ-శ్లోక / ముక్తక

రామో నామ బభూవ హుం తదబలా
సీతేతి
హుం తౌ పితుః
వాచా పఞ్చవటీవనే నివసతః
తామాహరత్ రావణః ।

కృష్ణేనేతి పురాతనిం నిజకథామ్
ఆకర్ణ్యమాత్రేరితాం
సౌమిత్రే క్వ ధనుర్ధనుర్ధనురితి
ప్రోక్తా గిరః పాన్తు వః ॥

sambhāṣaṇa-śloka / muktaka

rāmo nāma babhūva huṃ tadabalā – sīteti huṃ tau pituḥ
vācā pañcavaṭīvane nivasataḥ – tāmāharat rāvaṇaḥ ।
kṛṣṇeneti purātaniṃ nijakathām – ākarṇyamātreritāṃ
saumitre kva dhanurdhanurdhanuriti – proktā giraḥ pāntu vaḥ ॥

సూచన: ఆకాశవాణి (All India Radio) సంస్కృతపాఠం కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ (కేయూరాణి న భూషయన్తి పురుషం) తెలిస్తే ఈ శ్లోకం నేర్చుకోవడం సులువు. ఇక్కడ చూడండి.

నేపధ్యం: యశోదమ్మ చిన్నికృష్ణుడిని నిద్రపుచ్చడానికి అతనికి నిద్రవేళ కథను వివరిస్తోంది. సగం నిద్రలో ఉన్న శ్రీ కృష్ణుడు కథ వింటూ మైమరచి (తన మునుపటి అవతారం లోని) సీతను రక్షించడానికి లేచి తన విల్లును తీయడానికి ప్రయత్నిస్తున్నాడు.

యశోదా (yaśodā) :- రామః నామ బభూవ (rāmaḥ nāma babhūva) = చాలాకాలం క్రితం రాముడు అనే వ్యక్తి ఉండేవాడు
శ్రీకృష్ణ (śrīkṛṣṇa) :- హుం (huṃ) = హుం!
యశోదా (yaśodā) :- తత్-అబలా సీతా ఇతి (tat-abalā sītā iti) = అతని భార్య సీత
తౌ (tau) = ఇద్దరూ
పితుః వాచా (pituḥ vācā) = తండ్రి సూచన మేరకు
పఞ్చవటీనే నివసతః (pañcavaṭīne nivasataḥ) = ఐదు రకాల చెట్లు ఉండే (పంచవటి అనే) అడవిలో ఉంటున్నారు
రావణ: తామ్ ఆహరత్ (rāvaṇa: tām āharat) = రావణుడు ఆమెను అపహరించాడు
Author: కృష్ణేన (kṛṣṇena) = కృష్ణుడి ద్వారా
ఇతి (iti) = ఈ విధంగా
పురాతనీం నిజకథామ్ (purātanīṃ nijakathām) = తన స్వంత పురాతన కథ
మాత్రా ఈరితామ్ (mātrā īritām) = తల్లి చెప్పింది
ఆకర్ణ్య (ākarṇya) = అది వింటూ
శ్రీకృష్ణ (śrīkṛṣṇa) :- సౌమిత్రే క్వ ధనుః ధనుః ధనుః (saumitre kva dhanuḥ dhanuḥ dhanuḥ) = “లక్ష్మణా, నా విల్లు, నా విల్లు, నా విల్లు ఎక్కడ ఉంది?”
ఇతి ప్రోక్తాః గిరః (iti proktāḥ giraḥ) = ఈ పదాలు పలికిన (కృష్ణుడు)
వః పాన్తు (vaḥ pāntu) = మీ అందరినీ రక్షించుగాక.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం