8. చిన్తాయాస్చ చితాయాస్చ

చిన్తాయాస్చ చితాయాస్చ
బిన్దుమాత్రం విశేష్యతే ।
చితా దహతి నిర్జీవం
చిన్తా దహతి జీవితమ్ ॥

cintāyāsca citāyāsca
bindumātraṃ viśeṣyate

citā dahati nirjīvaṃ
cintā dahati jīvitam

చిన్తాయః (cintāyaḥ) = ‘చింత’ లో
చ (ca) = మరియు
చితాయాః (citāyāḥ) = ‘చిత’ లో
బిన్దుమాత్రం విశేష్యతే (bindumātraṃ viśeṣyate) = తేడా కేవలం ఒక చుక్క (సున్న) మాత్రమే
చితా నిర్జీవం దహతి (citā nirjīvaṃ dahati) = చిత నిర్జీవ (శవం) ని కాల్చివేస్తే
చిన్తా జీవితం దహతి (cintā jivitaṃ dahati) = చింత జీవినే కాలిచివేస్తుంది

అర్ధం: ‘చిత’, ‘చింత’ ల మధ్య వ్యత్యాసం ఒక్క బిందువు (చుక్క) మాత్రమే. చిత నిర్జీవ (శవం) ని కాల్చివేస్తే, చింత జీవినే కాలిచివేస్తుంది.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం