6. వాసనాద్వాసుదేవస్య

వాసనాద్వాసుదేవస్య
వాసితం భూవనత్రయమ్ ।
సర్వభూతనివాసోఽసి
వాసుదేవ నమోఽస్తు తే ॥

vāsanādvāsudevasya
vāsitaṃ bhūvanatrayam

sarvabhūtanivāso’si
vāsudeva namo’stu te

వాసుదేవస్య (vāsudevasya) = ఓ విష్నూ / కృష్ణా!
వాసుషు దివ్యతి (vāsuṣu divyati) = అన్ని వస్తువులలో ప్రకాశించేవాడా
OR వాసుదేవస్య అపత్యమ్ (vāsudevasya apatyam) = వాసుదేవ కుమారుడా
వాసనాత్(vāsanāt) = ఎవరి నివాసం / ఉనికి కారణంగా
భూవనత్రయం వాసితమ్ (bhūvanatrayaṃ vāsitam) = మూడు లోకాలు ఉన్నాయో
సర్వభూతనివాసః అసి (sarvabhūtanivāsaḥ asi) = మీరు అన్ని జీవులకు నివాసం
(హే) వాసుదేవ (vāsudeva) = ఓ విష్నూ,
తే నమః అస్తు (te namaḥ astu) = మీకు సాష్టాంగ నమస్కారాలు.

అర్ధం: ఓ విష్నూ / కృష్ణా! అన్ని వస్తువులలో ప్రకాశించేవాడా, వాసుదేవ కుమారుడా, ఎవరి నివాసం / ఉనికి కారణంగా మూడు లోకాలు ఉన్నాయో, మీరు అన్ని జీవులకు నివాసం. ఓ విష్నూ, మీకు సాష్టాంగ నమస్కారాలు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: మంజు సత్తిరాజు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం