14. అమన్త్రమక్షరం నాస్తి

అమన్త్రమక్షరం నాస్తి
నాస్తి మూలమనౌషధమ్ ।
అయోగ్యః పురుషో నాస్తి
యోజకస్తత్ర దుర్లభః ॥

amantramakṣaraṃ nāsti
nāsti mūlamanauṣadham ।
ayogyaḥ puruṣo nāsti
yojakastatra durlabhaḥ ॥

అమన్త్రమ్ అక్షరం న అస్తి (amantram akṣaraṃ na asti) = మంత్రంగా మార్చలేని అక్షరం లేదు
అనౌషధమ్ మూలం న అస్తి (anauṣadham mūlaṃ na asti) = ఔషధ నాణ్యత లేని మూలం లేదు
అయోగ్యః పురుషః న అస్తి (ayogyaḥ puruṣaḥ na asti) = అసమర్థుడు / పనికిరాని వ్యక్తి అంటూ ఎవరూ లేడు
యోజకః తత్ర దుర్లభః (yojakaḥ tatra durlabhaḥ) = అయితే, అక్షరం నుండి మంత్రాన్ని లేదా మూలం నుండి ఔషధాన్ని సృష్టించగల లేదా ఉద్యోగి నుండి ఉత్తమ ప్రయోజనాలను పొందగల ఒక యజమాని చాలా అరుదు.

సూచన: ప్రథమా విభక్తి

అర్ధం: మంత్రంగా మార్చలేని అక్షరం లేదు. ఔషధ నాణ్యత లేని మూలం లేదు. అసమర్థుడు / పనికిరాని వ్యక్తి అంటూ ఎవరూ లేడు. అయితే, అక్షరం నుండి మంత్రాన్ని లేదా మూలం నుండి ఔషధాన్ని సృష్టించగల లేదా ఉద్యోగి నుండి ఉత్తమ ప్రయోజనాలను పొందగల ఒక యజమాని చాలా అరుదు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: గూగుల్ ఇమేజెస్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం