సుభాషితం
యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా
శాస్త్రం తస్య కరోతి కిమ్ ।
లోచనాభ్యాం విహీనస్య
దర్పణః కిం కరిష్యతి ॥
yasya nāsti svayaṃ prajñā
śāstraṃ tasya karoti kim ।
locanābhyāṃ vihīnasya
darpaṇaḥ kiṃ kariṣyati ॥
యస్య స్వయం ప్రజ్ఞా న అస్తి (yasya svayaṃ prajñā na asti) = సొంత తెలివితేటలు లేని / ఉపయోగించని వ్యక్తి కోసం
తస్య శాస్త్రం కిమ్ కరోతి (tasya śāstraṃ kim karoti) = గ్రంథం అతని కోసం ఏమి చేయగలదు?
లోచనాభ్యాం విహీనస్య (locanābhyāṃ vihīnasya) = కళ్ళు లేని వ్యక్తి కోసం
దర్పణః కిం కరిష్యతి (darpaṇaḥ kiṃ kariṣyati) = అద్దం ఏమి చేయగలదు?
అర్ధం: కళ్ళు లేని వ్యక్తికి అద్దం ఏమి చేస్తుంది (ఎలాగ ఉపయోగపడుతుంది)? తెలివిలేని వ్యక్తికి గ్రంథం ఏమి ఉపయోగం?
సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం