19. విద్యా వివాదాయ

విద్యా వివాదాయ ధనం మదాయ
శక్తిః పరేషాం పరిపీడనాయ ।
ఖలస్య సాధోర్విపరీతమేతద్
జ్ఞానాయ దానాయ చ రక్షణాయ ॥

vidyā vivādāya dhanaṃ madāya
śaktiḥ pareṣāṃ paripīḍanāya ।
khalasya sādhorviparītametad
jñānāya dānāya ca rakṣaṇāya ॥

ఖలస్య (khalasya) = దుర్మార్గులు (సంపాదించిన)
విద్యా (vidyā) = విద్య
వివాదాయ (vivādāya) = చర్చ / వివాదం కోసం
ధనం (dhanaṃ) = సంపద
మదాయ (madāya) = గర్వం కోసం
శక్తిః (śaktiḥ) = శక్తి
పరేషాం పరిపీడనాయ (pareṣāṃ paripīḍanāya) = ఇతరులకు పీడించుకోవడం కోసం
సాధోః ఏతత్ విపరీతమ్ (sadhoḥ etat viparītam) = సాధు స్వభావం కలిగినవారి కోసం, ఇది వ్యతిరేకం
జ్ఞానాయ (jñānāya) = (విద్య) వివేకం కోసం
దానాయ (dānāya) = (సంపద) పంచుకోవడం / దానం కోసం
చ (ca) = మరియు
రక్షణాయ (rakṣaṇāya) = (శక్తి) రక్షించడం కోసం (ఇతరులను)

సూచన: చతుర్థీ విభక్తి (caturthī vibhakti) (Dative Case)

అర్ధం: దుర్మార్గులు (సంపాదించిన) విద్య – చర్చ / వివాదం కోసం; సంపద – గర్వం కోసం; శక్తి – ఇతరులకు పీడించుకోవడం కోసం (పనికివస్తుంది). సాధు స్వభావం కలిగినవారికి ఇది వ్యతిరేకం. విద్య – వివేకం కోసం; సంపద పంచుకోవడం / దానం కోసం మరియు శక్తి – (ఇతరులను) రక్షించడం కోసం (పనికివస్తుంది).

జ్ఞానం, సంపద, అధికారం మనల్ని భ్రష్టు పట్టించకూడదని సుభాషితకారుడు హెచ్చరిస్తున్నాడు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: Flaticon
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం