23. స్వగృహే పూజ్యతే మూర్ఖః

స్వగృహే పూజ్యతే మూర్ఖః
స్వగ్రామే పూజ్యతే ప్రభుః ।
స్వదేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే ॥

svagṛhe pūjyate mūrkhaḥ
svagrāme pūjyate prabhuḥ ।
svadeśe pūjyate rājā
vidvān sarvatra pūjyate ॥

స్వగృహే మూర్ఖః పూజ్యతే (svagṛhe mūrkhaḥ pūjyate) = ఒక మూర్ఖుడు అతని ఇంటిలో పూజింపబడతాడు
స్వగ్రామే ప్రభుః పూజ్యతే (svagrāme prabhuḥ pūjyate) = ఒక పాలకుడు తన గ్రామంలో పూజించబడతాడు
స్వదేశే రాజా పూజ్యతే (svadeśe rājā pūjyate) = ఒక రాజు తన రాజ్యంలో పూజించబడతాడు
విద్వాన్ సర్వత్ర పూజ్యతే (vidvān sarvatra pūjyate) = తెలివైన వ్యక్తి ప్రతిచోటా పూజించబడతాడు

సూచన: సప్తమీ విభక్తి (saptamī vibhakti) (Locative Case)

అర్ధం: ఒక మూర్ఖుడు అతని ఇంటిలో పూజింపబడతాడు; ఒక పాలకుడు తన గ్రామంలో పూజించబడతాడు; ఒక రాజు తన రాజ్యంలో పూజించబడతాడు; తెలివైన వ్యక్తి ప్రతిచోటా పూజించబడతాడు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం