27. ఏకశ్లోకీ-కృష్ణలీల*

ఏకశ్లోకీ-కృష్ణలీల

ఆదౌ దేవకీదేవి-గర్భజననం
గోపిగృహే వర్ధనం
మయాపూతనజీవితాపహరణం
గోవర్ధనోద్ధారణం ।
కంసచ్ఛేదన-కౌరవాదిహననం
కున్తీసుతాపాలనం
హ్యేతద్భాగవతం పురాణకథితం
శ్రీకృష్ణలీలామృతమ్ ॥

ekaślokī-kṛṣṇalīlā

ādau devakīdevi-garbhajananaṃ
gopigṛhe vardhanaṃ
mayāpūtanajīvitāpaharaṇaṃ
govardhanoddhāraṇaṃ ।
kaṃsacchedana-kauravādihananaṃ
kuntīsutāpālanaṃ
hyetadbhāgavataṃ purāṇakathitaṃ
śrīkṛṣṇalīlāmṛtam ॥

*సూచన: ఆకాశవాణి (All India Radio) సంస్కృతపాఠం కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ (కేయూరాణి న భూషయన్తి పురుషం) తెలిస్తే ఈ శ్లోకం నేర్చుకోవడం సులువు. ఇక్కడ చూడండి.

ఆదౌ (ādau) = చాలా కాలం క్రితం
దేవకీదేవి-గర్భ-జననం (devakīdevi-garbha-jananaṃ) = తల్లి దేవకి గర్భం నుండి పుట్టి
గోపిగృహే వర్ధనం (gopigṛhe vardhanaṃ) = ఒక గోపీ ఇంట్లో పెరిగి
మయా-పూతన-జీవిత-అపహరణం (mayā-pūtana-jīvita-apaharaṇaṃ) = పూతన అనే రాక్షసురాలి ప్రాణాన్ని తీసి
గోవర్ధన-ఉద్ధారణం (govardhana-uddhāraṇaṃ) = గోవర్ధన పర్వతం ఎత్తి
కంసచ్ఛేదన (kaṃsacchedana) = కంసుడిని చంపి
కౌరవాది-హననం (kauravādi-hananaṃ) = కౌరవుల మరణానికి కారణమై
కున్తీసుత-అపాలనం (kuntīsuta-apālanaṃ) = కుంతీ పుత్రులను రక్షించి
యేతత్ హి భాగవతం (yetat hi bhāgavataṃ) = ఇది నిజంగా భాగవతం
పురాణ-కథితం (purāṇa-kathitaṃ) = పురాణంలో వివరించబడిన
శ్రీకృష్ణ-లీల-అమృతమ్ (śrīkṛṣṇa-līla-amṛtam) = శ్రీ కృష్ణుడి యొక్క లీలా అమృతం

అర్ధం: చాలా కాలం క్రితం తల్లి దేవకి గర్భం నుండి పుట్టి; ఒక గోపీ ఇంట్లో పెరిగి; పూతన అనే రాక్షసురాలి ప్రాణాన్ని తీసి; గోవర్ధన పర్వతం ఎత్తి; కంసుడిని చంపి; కౌరవుల మరణానికి కారణమై; కుంతీ పుత్రులను రక్షించినట్లు చెప్పబడింది. ఇది నిజంగా భాగవతం, పురాణంలో వివరించబడిన, శ్రీ కృష్ణుడి యొక్క లీలా అమృతం.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం