24. కృష్ణో రక్షతు మాం చరాచరగురుః*

1కృష్ణో రక్షతు మాం చరాచరగురుః
2కృష్ణం నమిష్యామ్యహమ్
3కృష్ణేన ఏవ సురక్షితోఽహమసకృత్
4కృష్ణాయ తస్మై నమః ।
5కృష్ణాత్ ఏవ సముత్థితం జగదిదం
6కృష్ణస్య దాసోఽస్మ్యహం
7కృష్ణే భక్తిరచఞ్చలాస్తు భగవన్
8హే కృష్ణ తుభ్యం నమః ॥

kṛṣṇo1 rakṣatu māṃ carācaraguruḥ
kṛṣṇaṃ2 namiṣyāmyaham
kṛṣṇena3 eva surakṣito’hamasakṛt
kṛṣṇāya4 tasmai namaḥ ।
kṛṣṇāt5 eva samutthitaṃ jagadidaṃ
kṛṣṇasya6 dāso’smyahaṃ
kṛṣṇe7 bhaktiracañcalāstu bhagavan
he kṛṣṇa8 tubhyaṃ namaḥ ॥

*సూచన: ఆకాశవాణి (All India Radio) సంస్కృతపాఠం కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ (కేయూరాణి న భూషయన్తి పురుషం) తెలిస్తే ఈ శ్లోకం నేర్చుకోవడం సులువు. ఇక్కడ చూడండి.

చరాచరగురుః కృష్ణః మాం రక్షతు (carācaraguruḥ kṛṣṇaḥ māṃ rakṣatu) = చరాచరలకు గురువు అయిన శ్రీ కృష్ణుడు నన్ను రక్షించుగాక. – 1 ప్రథమా విభక్తి
అహం కృష్ణం నమిష్యామి (ahaṃ kṛṣṇaṃ namiṣyāmi) = శ్రీకృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాను. – 2 ద్వితీయా విభక్తి
అహం కృష్ణేన ఏవ అసకృత్ సురక్షితః (ahaṃ kṛṣṇena eva asakṛt surakṣitaḥ) =నేను ఎల్లప్పుడు శ్రీకృష్ణునిచే మాత్రమే రక్షింపబడుచున్నాను. – 3 తృతీయా విభక్తి
కృష్ణాయ తస్మై నమః (kṛṣṇāya tasmai namaḥ) = శ్రీ కృష్ణుని కొరకు / కోసం సాష్టాంగ ప్రణామాలు. – 4 చతుర్థీ విభక్తి
ఇదం జగత్ కృష్ణాత్ ఏవ సముత్థితం (idaṃ jagat kṛṣṇāt eva samutthitaṃ) = ఈ ప్రపంచం ఒక్క శ్రీకృష్ణుడి నుండే ఉద్భవించింది. – 5 పఞ్చమీ విభక్తి
అహం కృష్ణస్య దాసః అస్మి (ahaṃ kṛṣṇasya dāsaḥ asmi) = నేను శ్రీకృష్ణుని యొక్క సేవకుడిని. – 6 షష్టీ విభక్తి
కృష్ణే అచఞ్చలా భక్తిః అస్తు భగవన్ (kṛṣṇe acañcalā bhaktiḥ astu bhagavan) = శ్రీ కృష్ణ భగవానునిలో అచంచలమైన భక్తి ఉండు గాక. – 7 సప్తమీ విభక్తి
హే కృష్ణ తుభ్యం నమః (he kṛṣṇa tubhyaṃ namaḥ) = ఓ శ్రీకృష్ణా, నీకు సాష్టాంగ ప్రణామాలు. – 8సమ్బోధన ప్రథమా విభక్తి

1Nominative Case
2Accusative Case
3Instrumental Case
4Dative Case
5Ablative Case
6Genitive Case
7Locative Case
8Vocative Case

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం