32. ఈక్షణం ద్విగుణమ్

ఈక్షణం ద్విగుణమ్ ప్రోక్తం
భాషణస్యేతి వేధసా ।
అక్షిణీ ద్వే మనుష్యాణాం
జిహ్వాత్వైకేవ నిర్మితా ॥

īkṣaṇaṃ dviguṇam proktaṃ
bhāṣaṇasyeti vedhasā ।
akṣiṇī dve manuṣyāṇāṃ
jihvātvaikeva nirmitā ॥

ఈక్షణం ద్విగుణమ్ (īkṣaṇaṃ dviguṇam) = చూడటం రెట్టింపు ఉండాలి
భాషణస్య (bhāṣaṇasya) = మాట్లాడటం కంటే.
ఇతి (iti) = ఈ విధంగా
వేధసా ప్రోక్తం (vedhasā proktaṃ) = పండితులచేత చెప్పబడింది
మనుష్యాణాం (manuṣyāṇāṃ) = మానవులకు
అక్షిణీ ద్వే (akṣiṇī dve) = కళ్ళు రెండు
జిహ్వా తు ఏక ఏవ నిర్మితా (jihvā tu eka eva nirmitā) = కానీ సృష్టించబడిన నాలుక ఒక్కటే.

అర్ధం: మనిషికి ఒక నాలుక మరియు రెండు కళ్ళు ఇవ్వబడ్డాయి. విజ్ఞులు దీనికి చెప్పిన అర్దం, తద్వారా మనం మాట్లాడటం కంటే చూడటానికి (గమనించటం) పై ఎక్కువ దృష్టి పట్టలి చెయ్యలి అని.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం