31. భిక్షుః క్వాస్తి?*

సమ్భాషణ-శ్లోక – లక్ష్మీ, పార్వతీ

భిక్షుః క్వాస్తి బలేర్మఖే పశుపతిః
కిం నాస్త్యసౌ గోకులే
ముగ్ధే పన్నగభూషణః సఖి సదా
శేతే చ తస్యోపరి

ఆర్యే ముఞ్చ విశాదమాశు కమలే
నాహం ప్రకృత్యా చలా

చైవం వై గిరిజా-సముద్రతనయోః
సమ్భాషణం పతు వః ॥

sambhāṣaṇa-śloka – lakṣmī, pārvatī

bhikṣuḥ kvāsti balermakhe paśupatiḥ
kiṃ nāstyasau gokule
mugdhe pannagabhūṣaṇaḥ sakhi sadā
śete ca tasyopari
ārye muñca viśādamāśu kamale
nāhaṃ prakṛtyā calā
caivaṃ vai girijā-samudratanayoḥ
sambhāṣaṇaṃ patu vaḥ ॥

*సూచన: ఆకాశవాణి (All India Radio) సంస్కృతపాఠం కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ (కేయూరాణి న భూషయన్తి పురుషం) తెలిస్తే ఈ శ్లోకం నేర్చుకోవడం సులువు. ఇక్కడ చూడండి.

లక్ష్మీ: భిక్షుః క్వ అస్తి? lakṣmī: (bhikṣuḥ kva asti?) = బిక్షు (బిచ్చగాడు) ఎక్కడ?
పార్వతీ: బలేః మఖే pārvatī: (baleḥ makhe) = మహాబలి యజ్ఞంలో – (వామనుడు)
లక్ష్మీ: పశుపతిః lakṣmī: (paśupatiḥ) = పశువుల (జంతువుల) ప్రభువు / రక్షకుడు
పార్వతీ: అసౌ గోకులే న అస్తి కిమ్? pārvatī: (asau gokule na asti kim?) = అతను గోకులంలో లేడా? – (కృష్ణ)
లక్ష్మీ: ముగ్ధే lakṣmī: (mugdhe) = ఓ ప్రియమైన / మందబుద్ధీ
లక్ష్మీ: పన్నగభూషణః lakṣmī: (pannagabhūṣaṇaḥ) = పాము ఆభరణముగా గల్గిన
పార్వతీ:: సఖి సదా తస్య ఉపరి చ శేతే pārvatī: (sakhi sadā tasya upari ca śete ) = ఓ సఖీ! అతను ఎప్పుడూ దాని పైనే పడుకుంటాడు కదా – మహావిష్ణు (mahāviṣṇu)
లక్ష్మీ:: ఆర్యే lakṣmī: (ārye) = ఓ తెలివి కలిగిన దానా!
లక్ష్మీ: విశాదమ్ ఆశు ముఞ్చ lakṣmī: (viśādam āśu muñca) = వెంటనే దుఃఖాన్ని వదులుకో
పార్వతీ:: కమలే pārvatī: (kamale) = ఓ లక్ష్మి!
పార్వతీ: అహం ప్రకృత్యా చలా న pārvatī: (ahaṃ prakṛtyā calā na) = నేను స్వభావరీత్యా అస్థిరతను కాను (నీలాగ) – చంచల
చ ఏవం వై (ca evaṃ vai) = మరియు ఇది నిజానికి
గిరిజా-సముద్రతనయోః సమ్భాషణం (girijā-samudratanayoḥ sambhāṣaṇaṃ) = పార్వతీ (పర్వతరాజ పుత్రి) మరియు లక్ష్మీ (సముద్రుని కుమార్తె) ల మధ్య సంభాషణ
వాః పతు (vāḥ patu) = మనలను రక్షించు గాక!

సందర్భం: లక్ష్మీదేవికి, లక్ష్మీదేవికి మధ్య చమత్కారమైన సంభాషణ ఇలా సాగింది.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: మంజు సత్తిరాజు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం