29. ఆశా నామ్ మనుష్యాణాం

ఆశా నామ్ మనుష్యాణాం
కాచిదాశ్చర్యశృఙ్ఖలా ।
యయా బద్ధాః ప్రధావన్తి
ముక్తాస్తిష్ఠన్తి పఙ్గువత్ ॥

āśā nām manuṣyāṇāṃ
kācidāścaryaśṛṅkhalā ।
yayā baddhāḥ pradhāvanti
muktāstiṣṭhanti paṅguvat ॥

మనుష్యాణాం (manuṣyāṇāṃ) = మానవులకు
ఆశా నామ్ (āśā nām) = ‘కోరిక’ అనేది
కాచిత్ (kācit) = ఒక రకమైన
ఆశ్చర్య-శృఙ్ఖలా (āścarya-śṛṅkhalā) = అద్భుతమైన గొలుసు / సంకెల
యయా బద్ధాః (yayā baddhāḥ) = దానితో ముడిపడి ఉన్న / కట్టుబడి ఉన్నవారు
ప్రధావన్తి (pradhāvanti) = పరిగెత్తుతూనే ఉంటారు
ముక్తః (muktaḥ) = దాని నుండి విముక్తి పొందినవారు
పఙ్గువత్ తిష్ఠన్తి (paṅguvat tiṣṭhanti) = వికలాంగుడిలా ఒకే చోట కూర్చుంటారు

అర్ధం: విచిత్రమేమిటంటే, మానవులకు ‘కోరిక’ అనేది ఒక అద్భుతమైన గొలుసు / సంకెల వంటిది. దానితో ముడిపడి ఉన్న / కట్టుబడి ఉన్నవారు పరిగెత్తుతూనే ఉంటారు. దాని నుండి విముక్తి పొందినవారు వికలాంగుడిలా ఒకే చోట కూర్చుంటారు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం