28. పాపాన్నివారయతి

పాపాన్నివారయతి యోజయతే హితాయ
గుహ్యం నిగూహయతి గుణాన్ ప్రకటీకరోతి ।
ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే
సన్మిత్రలక్షణమిదం ప్రవదన్తి సన్తః ॥

pāpānnivārayati yojayate hitāya
guhyaṃ nigūhayati guṇān prakaṭīkaroti ।
āpadgataṃ ca na jahāti dadāti kāle
sanmitralakṣaṇamidaṃ pravadanti santaḥ ॥

పాపాన్ నివారయతి (pāpān nivārayati) = (నీ) పాపాలను నిరోధిస్తాడు
హితాయ యోజయతే (hitāya yojayate) = (నిన్ను) హితానికి జోడిస్తాడు
గుహ్యం నిగూహయతి (guhyaṃ nigūhayati) = (నీ) రహస్యాన్ని దాచిపెట్టి
గుణాన్ ప్రకటీకరోతి (guṇān prakaṭīkaroti) = (నీ) మంచి ధర్మాలను / గుణాలను వెల్లడిస్తాడు
ఆపద్-గతం చ న జహాతి (āpad-gataṃ ca na jahāti) = (నిన్ను) కష్టాలలో ఉన్నా విడిచిపెట్టడు మరియు
కాలే దదాతి (kāle dadāti) = సమయానికి ఆదుకుంటాడు
సన్తః ప్రవదన్తి (santaḥ pravadanti) = సాధువులు / గొప్పవారు అభివర్ణిస్తారు,
ఇదం సన్మిత్రలక్షణమ్ (idaṃ sanmitralakṣaṇam) = వీటిని మంచి స్నేహితుని లక్షణంగా

అర్ధం: (నీ) పాపాలను నిరోధిస్తాడు మరియు (నిన్ను) హితానికి జోడిస్తాడు. (నీ) రహస్యాన్ని దాచిపెట్టి, (నీ) మంచి ధర్మాలను / గుణాలను వెల్లడిస్తాడు. (నిన్ను) కష్టాలలో ఉన్నా విడిచిపెట్టడు మరియు సమయానికి ఆదుకుంటాడు. సాధువులు / గొప్పవారు వీటిని మంచి స్నేహితుని లక్షణంగా అభివర్ణిస్తారు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం