34. ఉదయే సవితా రక్తః

ఉదయే సవితా రక్తః
రక్తశ్చాస్తమయే తథా ।
సమ్పత్తౌ చ విపత్తౌ చ
మహతామేకరూపతా ॥

udaye savitā raktaḥ
raktaścāstamaye tathā ।
sampattau ca vipattau ca
mahatāmekarūpatā ॥

ఉదయే (udaye) = ఉదయిస్తున్నప్పుడు
సవితా (savitā) = సూర్యుడు
రక్తః (raktaḥ) = ఎర్రగా (ఉంటాడు)
చ (ca) = మరియు
తథా (tathā) = కూడా
అస్తమయే (astamaye) = అస్తమించేటప్పుడు
రక్తః (raktaḥ) = ఎర్రగా (ఉంటాడు)
సమ్పత్తౌ చ (sampattau ca) = మరియు సంపదలో
విపత్తౌ చ (vipattau ca) = మరియు విపత్తులో
మహతామ్ (mahatām) = గొప్ప వ్యక్తులు
ఏకరూపతా (ekarūpatā) = ఒకేలా ఉంటారు

అర్ధం: సూర్యోదయం సమయంలో సూర్యుడు ఎర్రగా ఉంటాడు. అస్తమించే సమయంలో కూడా సూర్యుడు ఎర్రగానే ఉంటాడు. అలాగే సంపదలో మరియు కష్టాలలో గొప్పవారు ఒకే విధంగా ఉంటారు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం