39. కిం కులేన విశాలేన

కిం కులేన విశాలేన
విద్యాహీనస్య దేహినః ।
అకులీనోఽపి విద్యావాన్
దేవైరపి సుపూజ్యతే ॥

kiṃ kulena viśālena
vidyāhīnasya dehinaḥ

akulīno’pi vidyāvān
devairapi supūjyate

విద్యాహీనస్య దేహినః (vidyāhīnasya dehinaḥ) = విద్యాహీనుడైనవాడు
కిం విశాలేన కులేన (kiṃ viśālena kulena) = ఎంత గొప్ప కులము (కుటుంబం) లో పుడితే నేమి?
విద్యావాన్ (vidyāvān) = విద్య (జ్ఞానము) కలిగినవాడు
అకులీనః అపి (akulīnaḥ api) = ఏ కులము (కుటుంబం) లో పుట్టినను
దేవై అపి సుపూజ్యతే (devai api supūjyate) = దేవతల చేత కూడా పూజింపబడతాడు

అర్ధం: విద్యాహీనుడైనవాడు ఎంత గొప్ప కులము (కుటుంబం) లో పుడితే నేమి? విద్య (జ్ఞానము) కలిగినవాడు ఏ కులము (కుటుంబం) లో పుట్టినను, దేవతల చేత కూడా పూజింపబడతాడు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం