37. కన్యా వరయతే రూపం

కన్యా వరయతే రూపం
మాతా విత్తం పితా శ్రుతమ్ ।
బాన్ధవ్యాః కులమిచ్ఛన్తి
మిష్టాన్నమితరే జనాః ॥

kanyā varayate rūpaṃ
mātā vittaṃ pitā śrutam

bāndhavyāḥ kulamicchanti
miṣṭānnamitare janāḥ

కన్యా రూపం వరయతే (kanyā rūpaṃ varayate) = (వివాహంలో) వధువు – రూపాన్ని (కోరుకుంటుంది)
మాతా విత్తం (mātā vittaṃ) = తల్లి – సంపద (కోరుకుంటుంది)
పితా శ్రుతమ్ (pitā śrutam) = తండ్రి – (వరుని) కీర్తి (కోరుకుంటాడు)
బాన్ధవ్యాః కులమ ఇచ్ఛన్తి (bāndhavyāḥ kulama icchanti) = బంధువులు (మంచి) కుటుంబం / వంశం (కోరుకుంటారు)
ఇతరే జనాః మిష్టాన్నమ్ (itare janāḥ miṣṭānnama) = ఇతర వ్యక్తులు (పెళ్లిలో) రుచికరమైన ఆహారం (కోరుకుంటారు)

అర్థం: వివాహంలో, వధువు రూపాన్ని ఎంచుకుంటుంది; తల్లి – సంపద; తండ్రి – కీర్తి; బంధువులు కుటుంబం / వంశం కోసం చూస్తారు. ఇతర వ్యక్తులు (పెళ్లిలో) రుచికరమైన ఆహారం కోసం చూస్తారు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం