36. ఏకమేవాక్షరం

ఏకమేవాక్షరం యత్తు
గురుః శిష్యం ప్రబోధయేత్ ।
పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం
యద్దత్వా చానృణీ భవేత్ ॥

ekamevākṣaraṃ yattu
guruḥ śiṣyaṃ prabodhayet

pṛthivyāṃ nāsti taddravyaṃ
yaddatvā cānṛṇī bhavet

ఏకం ఏవ అక్షరం తు (ekaṃ eva akṣaraṃ tu) = నిజానికి ఒక్క అక్షరం అయినా
యత్ గురుః శిష్యం ప్రబోధయేత్ (yat guruḥ śiṣyaṃ prabodhayet) = ఒక ఉపాధ్యాయుడు ఏ విద్యార్థికి బోధిస్తాడో
యత్ దత్వా (yat datvā) = (ఆ) విద్యార్థికి) దేనిని ఇవ్వడం వల్లనైతే
అనృణీ భవేత్ (anṛṇī bhavet) = (అటువంటి) ఋణము నుండి విముక్తి పొందగలడో
పృథివ్యాం తత్ ద్రవ్యం న అస్తి (pṛthivyāṃ tat dravyaṃ na asti) = భూమిపై అటువంటి సంపద లేదు.

అర్ధం: నిజానికి ఒక్క అక్షరం అయినా ఒక ఉపాధ్యాయుడు ఏ విద్యార్థికి బోధిస్తాడో, (ఆ విద్యార్థికి) దేనిని ఇవ్వడం వల్లనైతే (అటువంటి) ఋణము నుండి విముక్తి పొందగలడో భూమిపై అటువంటి సంపద లేదు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: గూగుల్ ఇమేజెస్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం