44. గుణవజ్జనసంసర్గాత్

గుణవజ్జనసంసర్గాత్
యాతి నీచోఽపి గౌరవమ్ ।
పుష్పమాలాప్రసఙ్గేణ
సూత్రం శిరసి ధార్యతే ॥

guṇavajjanasaṃsargāt
yāti nīco’pi gauravam

puṣpamālāprasaṅgeṇa
sūtraṃ śirasi dhāryate

గుణవత్-జన-సంసర్గాత్ (guṇavat-jana-saṃsargāt) = గొప్పవాని తో సహచర్యం / సాంగత్యం వలన
నీచః అపి (nīcaḥ api) = నీచుడు కూడా
గౌరవం యాతి (gauravaṃ yāti) = గౌరవం పొందును.
పుష్పమాలా-ప్రసఙ్గేణ (puṣpamālā-prasaṅgeṇa) = పుష్పమాలతో సాంగత్యము వలన
సూత్రం శిరసి ధార్యతే (sūtraṃ śirasi dhāryate) = దారము కూడా శిరోధార్యమగును.

అర్థం: గొప్పవాని తో సహచర్యం / సాంగత్యం వలన నీచుడు కూడా గౌరవం పొందును.
పుష్పమాలతో సాంగత్యము వలన దారము కూడా శిరోధార్యమగును.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం