42. గచ్ఛత్పిపీలికా

గచ్ఛత్పిపీలికా యాతి
యోజనాని శతాన్యపి ।
అగచ్ఛన్ వైనతేయోఽపి
పదమేకం న గచ్ఛతి ॥

gacchatpipīlikā yāti
yojanāni śatānyapi

agacchan vainateyo’pi
padamekaṃ na gacchati

గచ్ఛత్-పిపీలికా (gacchat-pipīlikā) = కదిలే చీమ
శతాని యోజనాని అపి యాతి (śatāni yojanāni api yāti) = వంద మైళ్ళు / యోజనాలు కూడా పోగలదు
అగచ్ఛన్ వైనతేయః (agacchan vainateyaḥ) = కదలని గ్రద్ద
ఏకం పదమ్ అపి న గచ్ఛతి (ekaṃ padam api na gacchati) = ఒక్క అడుగు కూడా కదలదు.

అర్థం: కదిలే చీమ వంద మైళ్ళు / యోజనాలు కూడా పోగలదు. కానీ కదలని గ్రద్ద ఒక్క అడుగు కూడా కదలదు. ప్రయత్నం సామర్థ్యం కంటే విలువైనది.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం