41. చక్షుషా మనసా వాచా

చక్షుషా మనసా వాచా
కర్మణా చ చతుర్విధమ్ ।
ప్రసాదయతి యో లోకం
తం లోకోఽనుప్రసీదతి ॥

cakṣuṣā manasā vācā
karmaṇā ca caturvidham

prasādayati yo lokaṃ
taṃ loko’nuprasīdati

చక్షుషా (cakṣuṣā) = కళ్ళ (చూపుల) తో
మనసా (manasā) = మనసు (ఆలోచనల) తో
వాచా (vācā) = వాక్కు (మాటల) తో
కర్మణా (karmaṇā) = కర్మల (చేసే ప్రతిపని) తో
చ (ca) = మరియు
చతుర్విధమ్ (caturvidham) = నాలుగు విధములుగా
యః లోకం ప్రసాదయతి (yaḥ lokaṃ prasādayati) = ఈ లోకాన్ని ఎవరైతే ప్రసన్నం చేసుకుంటాడో
లోకః తమ్ అనుప్రసీదతి (lokaḥ tam anuprasīdati) = అతనిని ఈ లోకం అలాగే కటాక్షిస్తుంది.

అర్థం: కళ్ళ (చూపుల) తో, మనసు (ఆలోచనల) తో, వాక్కు (మాటల) తో మరియు కర్మల (చేసే ప్రతిపని) తో నాలుగు విధములుగా ఈ లోకాన్ని ఎవరైతే ప్రసన్నం చేసుకుంటాడో అతనిని ఈ లోకం అలాగే కటాక్షిస్తుంది.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం