48. చిన్తనీయా హి విపదామ్

చిన్తనీయా హి విపదామ్
ఆదావేవ ప్రతిక్రియా ।
న కూపఖననం యుక్తం
ప్రదీప్తే వహ్నినా గృహే ॥

cintanīyā hi vipadām
ādāveva pratikriyā

na kūpakhananaṃ yuktaṃ
pradīpte vahninā gṛhe

విపదాం ప్రతిక్రియా (vipadāṃ pratikriyā) = విపత్తుకు పరిష్కారం
ఆదౌ ఏవ హి చిన్తనీయా (ādau eva hi cintanīyā) = (విపత్తు రాక) ముందే ఆలోచించాలి
వహ్నినా ప్రదీప్తే గృహే (vahninā pradīpte gṛhe) = ఇంటికి మంటలు అంటుకున్నప్పుడు
కూపఖననం న యుక్తమ్ (kūpakhananaṃ na yuktam) = బావి తవ్వడం ప్రారంభించడం సరికాదు.

అర్ధం: విపత్తు రాకముందే సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. ఇంటికి మంటలు అంటుకున్నప్పుడు బావి తవ్వడం ప్రారంభించడం సరికాదు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం