46. భాష్యకారం పతఞ్జలిం

భాష్యకారం పతఞ్జలిం
వాక్యకారం వరరుచిమ్ ।
పాణినిం సూత్రకారమ్ చ
సదా వన్దే మునిత్రయమ్ ॥

bhāṣyakāraṃ patañjaliṃ
vākyakāraṃ vararucim

pāṇiniṃ sūtrakāram ca
sadā vande munitrayam

(అహం) మునిత్రయం సదా వన్దే ((ahaṃ) munitrayaṃ sadā vande) = మునిత్రయమునకు సదా వందనములు
సూత్రకారం పాణినిమ్ (sūtrakāraṃ pāṇinim) = సూత్రకారుడగు పాణినికి
వాక్యకారం / వృత్తికారం వరరుచిమ్ (vākyakāraṃ / vṛttikāraṃ vararucim) = వాక్యకారుడు / వృత్తికారుడు అగు వరరుచికి
భాష్యకారం పతఞ్జలిమ్ (bhāṣyakāraṃ patañjalim) = మరియు భాష్యకారుడగు పతఞ్జలికి.

అర్ధం: మునిత్రయమునకు సదా వందనములు; సూత్రకారుడగు పాణినికి, వాక్యకారుడు / వృత్తికారుడు అగు వరరుచికి మరియు భాష్యకారుడగు పతఞ్జలికి.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: పోస్టల్ డిపార్ట్ మెంట్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం