53. ఏకేన శుష్కవృక్షేణ

ఏకేన శుష్కవృక్షేణ
దహ్యమానేన వహ్నినా ।
దహ్యతే తద్వనం సర్వం
కుపుత్రేణ కులం యథా ॥

ekena śuṣkavṛkṣeṇa
dahyamānena vahninā

dahyate tadvanaṃ sarvaṃ
kuputreṇa kulaṃ yathā

ఏకేన శుష్కవృక్షేణ (ekena śuṣkavṛkṣeṇa) = ఒక్క ఎండిన చెట్టు
వహ్నినా దహ్యమానేన (vahninā dahyamānena) = నిప్పు అంటుకోవడం వలన
తత్ సర్వం వనం దహ్యతే (tat sarvaṃ vanaṃ dahyate) = అడవి మొత్తం కాలిపోతుందో
యథా (yathā) = ఎలాగైతే
కుపుత్రేణ కులమ్ (kuputreṇa kulam) = చెడు ప్రవర్తన గల పిల్లవాడు మొత్తం వంశానికి (నాశనం చేయడానికి చాలు).

అర్ధం: ఒక్క ఎండిన చెట్టుకు నిప్పు అంటుకుంటే అది అడవిని మొత్తం కాల్చివేసినట్లుగా, ఒక్క చెడు ప్రవర్తన గల పిల్లవాడు మొత్తం వంశాన్ని కాల్చడానికి / నాశనం చేయడానికి చాలు। (ఉదాహరణ: రావణుడు)

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం