52. ఋణశేషోఽగ్నిశేషశ్చ

ఋణశేషోఽగ్నిశేషశ్చ
శత్రుశేషస్తథైవ చ ।
పునః పునః ప్రవర్ధన్తే
తస్మాత్ శేషం న రక్షయేత్ ॥

ṛṇaśeṣo’gniśeṣaśca
śatruśeṣastathaiva ca

punaḥ punaḥ pravardhante
tasmāt śeṣaṃ na rakṣayet

ఋణశేషః (ṛṇaśeṣaḥ) = ఋణశేషము (పూర్తిగా తీర్చని అప్పు)
అగ్నిశేషః (agniśeṣaḥ) = సంపూర్ణంగా చల్లార్చని మంట
తథా ఏవ చ (tathā eva ca) = మరియు
శత్రుశేషః (śatruśeṣaḥ) = శత్రుశేషము (పూర్తిగా నిర్మూలించని శత్రువు)
పునః పునః (punaḥ punaḥ) = మళ్ళీ మళ్ళీ
ప్రవర్ధన్తే (pravardhante) = వృద్ధి చెందుతూనే ఉంటాయి/ఉంటారు
తస్మాత్ (tasmāt) = అందువలన
శేషం న రక్షయేత్ (śeṣaṃ na rakṣayet) = (పై మూడిటికీ) శేషము మిగల్చరాదు (సమూలంగా వినాశనం చెయ్యలి)

అర్ధం: ఋణశేషము (పూర్తిగా తీర్చని అప్పు), సంపూర్ణంగా చల్లార్చని మంట మరియు శత్రుశేషము (పూర్తిగా నిర్మూలించని శత్రువు) మళ్ళీ మళ్ళీ వృద్ధి చెందుతూనే ఉంటాయి/ఉంటారు. అందువలన (పై మూడిటికీ) శేషము మిగల్చరాదు (సమూలంగా వినాశనం చెయ్యలి).

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం