55. మాణిక్యవీణాముపలాలయన్తీం

శ్యామలా-దణ్డకమ్ – కాలిదాస

మాణిక్యవీణాముపలాలయన్తీం
మదాలసాం మఞ్జులవాగ్విలాసామ్ ।
మాహేన్ద్రనీలద్యుతకోమలాఙ్గీమ్
మాతఙ్గకన్యాం మనసా స్మరామి ॥

māṇikyavīṇāmupalālayantīṃ
madālasāṃ mañjulavāgvilāsām

māhendranīladyutakomalāṅgīm
mātaṅgakanyāṃ manasā smarāmi

మాణిక్యవీణామ్ (māṇikyavīṇām) = రత్నాలతో చేసిన వీణను
ఉపలాలయన్తీమ్ (upalālayantīm) = ఎంతో ప్రేమతో వాయించే
మదాలసామ్ (madālasām) = అత్యంత మనోహరమైన (మదేన అలసామ్ – madena alasām)
మఞ్జుల వాక్ విలాసామ్ (mañjula vāk vilāsām) = జ్ఞానముతో సుసంపన్నమైన మధురమైన వాక్కు గల
మాహేన్ద్రనీల-ద్యుతకోమలాఙ్గీమ్ (māhendranīla-dyutakomalāṅgīm) = ఎవరి శరీరం నీలి రత్నం (సఫైర్)తో నిర్మితమైందో
మాతఙ్గకన్యామ్ (mātaṅgakanyām) = ఎవరు మాతంగ ఋషి కుమార్తెయో
మనసా స్మరామి (manasā smarāmi) = (వానిని) నేను నా మనసులో స్మరించుకుంటాను.

అర్ధం: రత్నాలతో చేసిన వీణను ఎంతో ప్రేమతో వాయిస్తున్న; అత్యంత మనోహరమైన; జ్ఞానముతో సుసంపన్నమైన మధురమైన వాక్కు గల, నీలి రత్నం (సఫైర్)తో నిర్మితమైన శరీరం గల మరియు మాతంగ ఋషి కుమార్తె(ను) నా మనసులో స్మరించుకుంటాను. (కాళిదాసు యొక్క శ్యామలా-దణ్డకమ్ నుండి)

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం