61. జిహ్వా ప్రమాణం జానీహి

జిహ్వా ప్రమాణం జానీహి
భాషాణే భోజనేఽపి చ ।
అత్యుక్తిరతిభుక్తిశ్చ
సత్యం ప్రాణాపహారిణీ ॥

jihvā pramāṇaṃ jānīhi
bhāṣāṇe bhojane’pi ca

atyuktiratibhuktiśca
satyaṃ prāṇāpahāriṇī

జిహ్వా ప్రమాణం జానీహి (jihvā pramāṇaṃ jānīhi) = నాలుక సరైన సాధనమని తెలుసుకో
భాషాణే భోజనే అపి (bhāṣāṇe bhojane api) = మాట్లాడటం మరియు తినడం / రుచి చూడటం కోసం
అతి-ఉక్తి (ati-ukti) = అతిగా మాట్లాడటం
అతిభుక్తిః చ (atibhuktiḥ ca) = మరియు అతిగా తినడం
సత్యమ్ (satyam) = నిజంగా
ప్రాణా-అపహారిణీ (prāṇā-apahāriṇī) = ప్రాణాన్ని తీసేస్తుంది

అర్ధం: మాట్లాడటం మరియు తినడం / రుచి చూడటం కోసం నాలుక సరైన సాధనమని తెలుసుకో. అతిగా మాట్లాడటం, మరియు అతిగా తినడం నిజంగా ప్రాణాన్ని తీసేస్తుంది సుమా. (అందుచేత నాలుకని జగ్రత్తగా వాడుకో!)

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం