62. తక్షకస్య విషం దన్తే

తక్షకస్య విషం దన్తే
మక్షికాయాశ్చ మస్తకే ।
వృశ్చికస్య విషం పుచ్ఛే
సర్వాఙ్గే దుర్జనస్య చ ॥

takṣakasya viṣaṃ dante
makṣikāyāśca mastake

vṛścikasya viṣaṃ pucche
sarvāṅge durjanasya ca

విషం (viṣaṃ) = విషము
తక్షకస్య దన్తే (takṣakasya dante) = పాముకు కోరలలో
మక్షికాయాః చ మస్తకే (makṣikāyāḥ ca mastake) = మరియు తేనెటీగకు తలలో
వృశ్చికస్య పుచ్ఛే (vṛścikasya pucche) = తేలుకు తోకలో
సర్వాఙ్గే దుర్జనస్య చ (sarvāṅge durjanasya ca) = మరియు ఒక చెడ్డ వ్యక్తి యొక్క మొత్తం శరీరంలో (ఉంటుంది).

అర్ధం: విషము పాముకు కోరలలో; తేనెటీగకు తలలో; తేలుకు తోకలో మరియు చెడ్డ వ్యక్తి యొక్క మొత్తం శరీరంలో ఉంటుంది. సుమారుగా ఇటువంటి సుభాషితమే బద్దెన భూపాలుని సుమతీ శతకము నుండి:

తలనుండు విషము ఫణికిని,
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్,
తల తోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం