70. దుర్జనః ప్రియవాదీ

దుర్జనః ప్రియవాదీతి
నైతద్దిశ్వాసకారణమ్ ।
మధు తిష్ఠతి జిహ్వాగ్రే
హృదయే తు హలాహలమ్ ॥

durjanaḥ priyavādīti
naitaddiśvāsakāraṇam ।
madhu tiṣṭhati jihvāgre
hṛdaye tu halāhalam ॥

దుర్జనః (durjanaḥ) = దుర్జనుడు (చెడ్డ వ్యక్తి)
ప్రియవాదీ (priyavādī) = ప్రియంగా మాట్లాడేవాడు
ఇతి ఏతత్ విశ్వాసకారణమ్ (iti etat viśvāsakāraṇam) = ఒక వ్యక్తిపై విశ్వాసం ఉంచడానికి లేదా విశ్వసించకపోవడానికి ఇది కాదు కారణం
జిహ్వాగ్రే మధు తిష్ఠతి (jihvāgre madhu tiṣṭhati) = నాలుక అంచున తేనె (ఉండవచ్చు)
హృదయే తు హలాహలమ్ (hṛdaye tu halāhalam) = హృదయంలో విషం (ఉండవచ్చు సుమా)

అర్ధం: చెడ్డవాడు అయినా మధురంగా ​​మాట్లాడేవాడు కదా అని అతన్ని నమ్మవద్దు. అతని మాటల్లో తేనె ఉండవచ్చు కానీ అతని హృదయంలో విషం కూడా ఉండవచ్చు సుమా!

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం