66. త్యజేదేకం కులస్యార్థే

త్యజేదేకం కులస్యార్థే
గ్రామస్యార్థే కులం త్యజేత్ ।
గ్రామం జనపదస్యార్థే
హ్యాత్మార్థే పృథివీం త్యజేత్ ॥

tyajedekaṃ kulasyārthe
grāmasyārthe kulaṃ tyajet

grāmaṃ janapadasyārthe
hyātmārthe pṛthivīṃ tyajet

కులస్య అర్థే ఏకం త్యజేత్ (kulasya arthe ekaṃ tyajet) = ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని త్యాగం చెయ్యొచ్చు
గ్రామస్య అర్థే కులం త్యజేత్ (grāmasya arthe kulaṃ tyajet) = ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని త్యాగం చెయ్యొచ్చు
జనపదస్య అర్థే గ్రామం (త్యజేత్) (janapadasya arthe grāmaṃ (tyajet)) = దేశం కోసం గ్రామాన్ని త్యాగం చెయ్యొచ్చు
అత్మార్థే హి పృథివీం త్యజేత్ (atmārthe hi pṛthivīṃ tyajet) = ఆత్మ (జ్ఞానం) కోసం ఏకంగా భూమిని త్యాగం చెయ్యొచ్చు.

అర్ధం: ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని త్యాగం చెయ్యొచ్చు. ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని త్యాగం చెయ్యొచ్చు. దేశం కోసం గ్రామాన్ని త్యాగం చెయ్యొచ్చు. ఆత్మ (జ్ఞానం) కోసం ఏకంగా భూమినే త్యాగం చెయ్యొచ్చు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం