74. నిర్ధనశ్చాపి కామార్థీ

నిర్ధనశ్చాపి కామార్థీ
దరిద్రః కలహప్రియః ।
మన్దశాస్త్రో వివాదార్థీ
త్రివిధం మూర్ఖలక్షణమ్ ॥

nirdhanaścāpi kāmārthī
daridraḥ kalahapriyaḥ ।
mandaśāstro vivādārthī
trividhaṃ mūrkhalakṣaṇam ॥

నిర్ధనః చ అపి కామార్థీ (nirdhanaḥ ca api kāmārthī) = డబ్బు లేదుకానీ ఆనందం కోసం చాలా కోరికలు ఉన్నాయి
దరిద్రః కలహప్రియః (daridraḥ kalahapriyaḥ) = శక్తి లేదుకానీ, తగాదాలంటే ఇష్టం
మన్దశాస్త్రః వివాదార్థీ (mandaśāstraḥ vivādārthī) = శాస్త్రం నేర్చుకోవడం/అధ్యయనం చేయడంలో నిదానం (మందబుద్ధి) కానీ వివాదలు అంటే ఇష్టం
త్రివిధం మూర్ఖలక్షణమ్ (trividhaṃ mūrkhalakṣaṇam) = ఈ మూడు మూర్ఖుని లక్షణాలు.

అర్ధం: డబ్బు లేదుకానీ ఆనందం కోసం చాలా కోరికలు ఉన్నాయి; శక్తి లేదుకానీ, తగాదాలంటే ఇష్టం; శాస్త్రం నేర్చుకోవడం/అధ్యయనం చేయడంలో నిదానం (మందబుద్ధి) కానీ వివాదలు అంటే ఇష్టం; ఈ మూడు మూర్ఖుని లక్షణాలు / ఈ లక్షణాలున్న ముగ్గురూ మూర్ఖులు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం