4. హే హేరమ్బ*

సమ్భాషణ శ్లోకం

హే హేరమ్బ కిమమ్బ రోదిషి కథం
కర్ణౌ లుఠత్యగ్నిభూః
కిమ్ తే స్కన్ద విచేష్టితం మమ పురా
సఙ్ఖ్యాకృతా చాక్షుషమ్ ।

నైతత్రేఽప్యుచితం గజాస్య చరితం
నాసాం మిమీతేఽమ్బ మే
తావేవం సహసా విలోక్య హసిత
వ్యగ్రా శివా పాతు వః ॥

(sambhāṣaṇa ślokaṃ)

he heramba kimamba rodiṣi kathaṃ karṇau luṭhatyagnibhūḥ
kim te skanda viceṣṭitaṃ mama purā saṅkhyākṛtā cākṣuṣam ।
naitatre’pyucitaṃ gajāsya caritaṃ nāsāṃ mimīte’mba me
tāvevaṃ sahasā vilokya hasita – vyagrā śivā pātu vaḥ ॥

*సూచన: ఆకాశవాణి (All India Radio) సంస్కృతపాఠం కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ (కేయూరాణి న భూషయన్తి పురుషం) తెలిస్తే ఈ శ్లోకం నేర్చుకోవడం సులువు. ఇక్కడ చూడండి.

పార్వతీ (pārvatī) : హే హేరమ్బ (he heramba ) = హే గణేశా; హేరమ్బః (herambaḥ) = హే రణే శివసమిపే వా రమ్బతే (he raṇe śivasamipe vā rambate)= యుద్ధంలో (లేదా శివుని దగ్గర) శబ్దం చేసేవాడు
గణేశః (gaṇeśaḥ) : అమ్బ కిమ్ (amba kim) = ఏంటి అమ్మా?
పార్వతీ (pārvatī) : కథం రోదిషి (kathaṃ rodiṣi) = ఎందుకు ఏడుస్తున్నావు?
గణేశః (gaṇeśaḥ) : అగ్నిభూః కర్ణౌ లుఠతి (agnibhūḥ karṇau luṭhati) = కార్తికేయ నా చెవులు లాగాడు
అగ్నిభూః (agnibhūḥ) = అగ్నేః భవతి ఇతి (agneḥ bhavati iti) = అగ్ని నుండి పుట్టినవాడు
పార్వతీ (pārvatī) : స్కన్ద కిం తే విచేష్టితమ్ (skanda kiṃ te viceṣṭitam) = ఓ స్కందా, ఏమిటి ఇది?
स्कन्दः (skandaḥ) : పురా (తేన) మమ చాక్షుషామ్ సఙ్ఖ్యాకృతా (purā (tena) mama cākṣuṣām saṅkhyākṛtā) = నా కళ్ళు ముందు లెక్కించబడ్డాయి (అతని ద్వారా)
పార్వతీ (pārvatī) : గజాస్య తే యేతత్ చరితం అపి న ఉచితమ్ (gajāsya te yetat caritaṃ api na ucitam) = ఓ గణేశా, నీ ఈ ప్రవర్తన కూడా సరికాదు
గణేశః (gaṇeśaḥ) : అమ్బ మే నాసాం మిమితే (amba me nāsāṃ mimite) = ఓ తల్లీ, అతను నా ముక్కు (పొడవు) ను ముందుగా కొలిచాడు
ఏవమ్ (evam) = ఈ విధంగా
తౌ సహసా విలోక్య (tau sahasā vilokya) = నవ్వుతూ ఇద్దరినీ చూస్తూ
హసితవ్యగ్రా శివా(hasitavyagrā śivā) = చిరునవ్వులో మునిగిపోయిన పార్వతి
వః పాతు (vaḥ pātu) =మనల్ని రక్షించుగాక

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం