7. సర్వజ్ఞే సర్వవరదే

సర్వజ్ఞే సర్వవరదే
సర్వదుష్టభయఙ్కరి ।
సర్వదుఃఖహరే దేవి
మహాలక్ష్మి నమోఽస్తు తే ॥

sarvajñe sarvavarade
sarvaduṣṭabhayaṅkari

sarvaduḥkhahare devi
mahālakṣmi namo’stu te

(హే) దేవి (he) (devi) = హే దేవీ
(హే) సర్వజ్ఞే (he) (sarvajñe)= (హే దేవీ), అన్నీ తెలిసిన దేవీ
(హే) సర్వవరదే (he) (sarvavarade) = (హే దేవీ), సకల వరాలను ప్రసాదించే (దేవీ)
(హే) సర్వ-దుష్ట-భయఙ్కరి (he) (sarva-duṣṭa-bhayaṅkari) = (హే దేవీ), దుర్మార్గులందరిలో భయాన్ని కలిగించే (దేవీ)
(హే) సర్వదుఃఖహరే (he) (sarvaduḥkhahare) = (హే దేవీ), సర్వ దుఃఖాన్ని దూరం చేసే (దేవీ)
(హే) మహలక్ష్మి (he) (mahalakṣmi) = (హే దేవీ), మహాలక్ష్మీ
తే నమః అస్తు (te namaḥ astu) = నీకు సాష్టాంగ ప్రణామం.

అర్ధం: అన్నీ తెలిసిన దేవీ, సకల వరాలను ప్రసాదించే (దేవీ), దుర్మార్గులందరిలో భయాన్ని కలిగించే (దేవీ), సర్వ దుఃఖాన్ని దూరం చేసే (దేవీ), మహాలక్ష్మీ, నీకు సాష్టాంగ ప్రణామం

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం