9. నపుంసకమితి జ్ఞాత్వా

చాటు శ్లోకం

నపుంసకమితి జ్ఞాత్వా
ప్రియయై ప్రేషితం మనః ।
తత్తు తత్రైవ రమతే
హతాః పాణినినా వయమ్ ॥

cāṭu ślokaṃ

napuṃsakamiti jñātvā
priyayai preṣitaṃ manaḥ

tattu tatraiva ramate
hatāḥ pāṇininā vayam

నపుంసకమ్ ఇతి జ్ఞాత్వా (napuṃsakam iti jñātvā) = నపుంసకత్వమని భావించి
మనః ప్రియయై ప్రేషితమ్ (manaḥ priyayai preṣitam) = మనస్సు ప్రియతమకు పంపబడింది
తత్ తు తత్ర ఏవ రమతే (tat tu tatra eva ramate) = కానీ ఇప్పుడు అది అక్కడే ఆనందిస్తోంది.
వయం పణినినా హతాః (vayaṃ paṇininā hatāḥ) = అయ్యో! మేము పాణిని చేత చంపబడ్డాము.

అర్ధం: (మనసు) నపుంసకత్వమని భావించి, మనస్సు ప్రియతమకు పంపబడింది. కానీ ఇప్పుడు అది అక్కడే ఆనందిస్తోంది. అయ్యో! మేము పాణిని చేత చంపబడ్డాము.

సూచన: సంస్కృత భాషలో, లింగం (gender) ప్రతిపాదిక (మూల పదం) ద్వారా నిర్ణయించబడుతుంది కానీ అది సూచించే వస్తువు ద్వారా కాదు. రచయిత (ఏవరో తెలియదు), ఈ శృంగారరసం తో కూడిన ‘చాటు’ శ్లోకం ద్వారా పాణిని (ప్రసిద్ధ వ్యాకరణవేత్త) ని నిందిస్తున్నాడు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం