11. యత్ర యత్ర రఘునాథకీర్తనం

యత్ర యత్ర రఘునాథకీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాఞ్జలిమ్ ।
బాష్పవారిపరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాన్తకమ్ ॥

yatra yatra raghunāthakīrtanaṃ
tatra tatra kṛtamastakāñjalim

bāṣpavāriparipūrṇalocanaṃ
mārutiṃ namata rākṣasāntakam

యత్ర యత్ర (yatra yatra) = ఎక్కడైతే
రఘునాథకీర్తనం (raghunāthakīrtanaṃ) = శ్రీరాముని మహిమను గానం చేస్తారో
తత్ర తత్ర (tatra tatr) = అక్కడ (ఉండే)
కృతమస్తక-అఞ్జలిమ్ (kṛtamastaka-añjalim) = చేతులు పూర్తిగా తల దగ్గర పెట్టుకుని
బాష్పవారి-పరిపూర్ణ-లోచనం (bāṣpavāri-paripūrṇa-locanaṃ) = కన్నీళ్లతో నిండిన కళ్ళతో
మారుతిం (mārutiṃ) = మరుత్ (వాయు దేవత) కుమారునికి
రాక్షస-అన్తకమ్ (rākṣasa-antakam) = రాక్షసులను సంహరించేవాడికి
నమతః (అస్మి) (namataḥ asmi) = నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను

అర్ధం: ఎక్కడైతే శ్రీరాముని మహిమను గానం చేస్తారో, అక్కడ చేతులు పూర్తిగా తల దగ్గర పెట్టుకుని, కన్నీళ్లతో నిండిన కళ్ళతో, ఉండే మరుత్ (వాయు దేవత) కుమారునికి, రాక్షసులను సంహరించేవాడికి, నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం