13. రామో రాజమణిః*

రామో1 రాజమణిః సదా విజయతే
రామం2 రమేశం భజే
రామేణ3 అభిహతా నిశాచరచమూః
రామాయ4 తస్మై నమః ।
రామాత్5 నాస్తి పరాయణం పరతరం
రామస్య6 దాసోఽస్మ్యహం
రామే7 చిత్తలయః సదా భవతు మే
భో రామ8 మాముద్ధర ॥

(రామ రక్షా స్తోత్రమ్)

rāmo1 rājamaṇiḥ sadā vijayate
rāmaṃ2 rameśaṃ bhaje
rāmeṇa3 abhihatā niśācaracamūḥ
rāmāya4 tasmai namaḥ ।
rāmāt5 nāsti parāyaṇaṃ parataraṃ
rāmasya6 dāso’smyahaṃ
rāme7 cittalayaḥ sadā bhavatu me
bho rāma8 māmuddhara ॥

(rāma rakṣā stotram)

*సూచన: ఆకాశవాణి (All India Radio) సంస్కృతపాఠం కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ (కేయూరాణి న భూషయన్తి పురుషం) తెలిస్తే ఈ శ్లోకం నేర్చుకోవడం సులువు. ఇక్కడ చూడండి.

రాజమణిః రామః సదా విజయతే = రాజులలో రత్నం అయిన శ్రీరాముడు ఎల్లప్పుడూ విజయం సాధిస్తాడు – 1 ప్రథమా విభక్తి
(అహమ్) రమేశం రామం భజే = నేను రమ (లక్ష్మి) భర్త అయిన శ్రీరాముడిని పూజిస్తాను – 2 ద్వితీయా విభక్తి
రామేణ నిశాచరచమూః అభిహతా = రాక్షసుల సైన్యం (నిశాచరులు) శ్రీరామునిచే చంపబడెను – 3 తృతీయా విభక్తి
తస్మై రామాయ నమః = ఆ శ్రీరామునికి ప్రణామాలు – 4 చతుర్థీ విభక్తి
రామాత్ పరతరం పరాయణం న అస్తి = శ్రీరాముని కంటే గొప్ప మార్గం లేదు- 5 పఞ్చమీ విభక్తి
అహం రామస్య దాసః అస్మి= నేను శ్రీరాముని సేవకుడిని – 6 షష్టీ విభక్తి
రామే మే చిత్తలయః సదా భవతు= నా మనస్సు యొక్క విరామము ఎల్లప్పుడు శ్రీరామునిలో ఉండుగాక 7 సప్తమీ విభక్తి
భో రామ మామ్ ఉద్ధర = ఓ శ్రీరామా, దయచేసి నన్ను ఉద్ధరించండి – 8 సమ్బోధన ప్రథమా విభక్తి

అర్ధం: రాజులలో రత్నం అయిన శ్రీరాముడు ఎల్లప్పుడూ విజయం సాధిస్తాడు. నేను రమ (లక్ష్మి) భర్త అయిన శ్రీరాముడిని పూజిస్తాను. రాక్షసుల సైన్యం (నిశాచరులు) శ్రీరామునిచే చంపబడెను. ఆ శ్రీరామునికి ప్రణామాలు. శ్రీరాముని కంటే గొప్ప మార్గం లేదు. నేను శ్రీరాముని సేవకుడిని. నా మనస్సు యొక్క విరామము ఎల్లప్పుడు శ్రీరామునిలో ఉండుగాక. ఓ శ్రీరామా, దయచేసి నన్ను ఉద్ధరించండి.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం