15. వసుదేవసుతం దేవం

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ ।
దేవకీపరమానన్దం కృష్ణం వన్దే జగద్గురుమ్ ॥

vasudevasutaṃ devaṃ kaṃsacāṇūramardanam ।
devakīparamānandaṃ kṛṣṇaṃ vande jagadgurum ॥

వసుదేవసుతం (vasudevasutaṃ) = వసుదేవుని కుమారుడూ (వాసుదేవుడు)
దేవకీపరమానన్దం (devakīparamānandaṃ) = దేవకీ తల్లికి సంతోషాన్ని ఇచ్చేవాడూ
కంసచాణూరమర్దనమ్ (kaṃsacāṇūramardanam) = కంసుడినీ మరియూ చాణూరిడినీ విధ్వంసం చేసినవాడూ
దేవం కృష్ణం (devaṃ kṛṣṇaṃ) = అయిన శ్రీకృష్ణుడికి
జగద్గురుమ్ (jagadgurum) = జగద్గురువు కు
వన్దే (vande) = నమస్కారం చేస్తున్నాను.

సూచన: ద్వితీయా విభక్తి / Accusative Case (2nd Case)

అర్ధం: వసుదేవుని కుమారుడూ, దేవకీ తల్లికి సంతోషాన్ని ఇచ్చేవాడూ, కంసుడినీ మరియూ చాణూరిడినీ విధ్వంసం చేసినవాడూ, జగద్గురువూ అయిన శ్రీకృష్ణుడికి నమస్కారం చేస్తున్నాను.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం