21. విద్యా దదాతి వినయం

విద్యా దదాతి వినయం
వినయాద్ యాతి పాత్రతామ్ ।
పాత్రత్వాద్ ధనమాప్నోతి
ధనాద్ ధర్మః తతః సుఖమ్ ॥

vidyā dadāti vinayaṃ
vinayād yāti pātratām ।
pātratvād dhanamāpnoti
dhanād dharmaḥ tataḥ sukham ॥

విద్యా వినయం దదాతి (vidyā vinayaṃ dadāti) = జ్ఞానం వినయాన్ని ఇస్తుంది (జ్ఞానం నుండి వినయం వస్తుంది)
వినయాద్ పాత్రతామ్ యాతి (vinayād pātratām yāti) = వినయం వలన అర్హత కలుగుతుంది
పాత్రత్వాద్ ధనమ్ ఆప్నోతి (pātratvād dhanam āpnoti) = అర్హత వలన సంపద కలుగుతుంది
ధనాద్ ధర్మః (dhanād dharmaḥ) = సంపద వలన స్వధర్మాన్ని పాటించడనికి వీలుకలుగుతుంది
తతః సుఖమ్ (tataḥ sukham) = దాని తరువాత / దాని నుండి ఆనందమే ఆనందం

సూచన: పఞ్చమీ విభక్తి (pañcamī vibhakti) (Ablative Case)

అర్ధం: జ్ఞానం వినయాన్ని ఇస్తుంది (జ్ఞానం నుండి వినయం వస్తుంది); వినయం వలన అర్హత కలుగుతుంది; అర్హత వలన సంపద కలుగుతుంది; సంపద వలన స్వధర్మాన్ని పాటించడనికి వీలుకలుగుతుంది; దాని తరువాత / దాని నుండి ఆనందమే ఆనందం.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం