22. హస్తస్య భూషణం దానం

హస్తస్య భూషణం దానం
సత్యం కణ్ఠస్య భూషణమ్ ।
శ్రోత్రస్య భూషణం శాస్త్రం
భూషణైః కిం ప్రయోజనమ్ ॥

hastasya bhūṣaṇaṃ dānaṃ
satyaṃ kaṇṭhasya bhūṣaṇam ।
śrotrasya bhūṣaṇaṃ śāstraṃ
bhūṣaṇaiḥ kiṃ prayojanam ॥

హస్తస్య భూషణం దానం (hastasya bhūṣaṇaṃ dānaṃ) = దానము చేతికి ఆభరణము
కణ్ఠస్య భూషణం సత్యం (kaṇṭhasya bhūṣaṇam satyaṃ) = సత్యం కంఠానికి ఆభరణం
శ్రోత్రస్య భూషణం శాస్త్రం (śrotrasya bhūṣaṇaṃ śāstraṃ) = వినడం (శాస్త్రం) చెవికి ఆభరణం
(అన్యైః) భూషణైః కిం ప్రయోజనమ్ ((anyaiḥ) bhūṣaṇaiḥ kiṃ prayojanam) = (ఇతర) ఆభరణాల ఉపయోగం / ప్రయోజనం ఏమిటి?

సూచన: షష్టీ విభక్తి (ṣaṣṭī vibhakti) (Genitive Case)

అర్ధం: దానము చేతికి ఆభరణము; సత్యం కంఠానికి ఆభరణం; వినడం (శాస్త్రం) చెవికి ఆభరణం. మరి (ఇతర) ఆభరణాల ఉపయోగం / ప్రయోజనం ఏమిటి?

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం